Prakasam District MP And MLAs Attended Engagement Program - Sakshi
Sakshi News home page

నిశ్చితార్థానికి హాజరైన వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు

Aug 14 2022 8:37 AM | Updated on Aug 14 2022 2:54 PM

Prakasam District MP and MLAs attended Engagement Program - Sakshi

ఇంద్రసేనారెడ్డి, దివ్యజ్యోతి జంటను అభినందిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు

సాక్షి, ప్రకాశం(చీమకుర్తి): వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు మండల కన్వీనర్‌ దుంపా చెంచిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ కుమారుడు దుంపా ఇంద్రసేనారెడ్డి, దివ్యజ్యోతిల నిశ్చయ తాంబూలాల వేడుకను శనివారం ఒంగోలులోని విష్ణుప్రియ ఫంక్షన్‌ హాలులో వైభవంగా నిర్వహించారు.

వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డి, ఒంగోలు నగర మేయర్‌ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఇనగంటి పిచ్చిరెడ్డి, మారం వెంకారెడ్డి, పలు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ స్థానిక నాయకులు, జిల్లాలోని పలువురు అధికారులు హాజరై ఇంద్రసేనారెడ్డి, దివ్యజ్యోతి జంటను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి: (డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో కల్వర్టును ఢీకొన్న కారు.. వరుడు సహా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement