నారా లోకేశ్‌కు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు: పేర్ని నాని | Perni Nani on mega dsc in vijayawada | Sakshi
Sakshi News home page

నారా లోకేశ్‌కు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు: పేర్ని నాని

Jun 1 2026 5:58 PM | Updated on Jun 1 2026 6:08 PM

 Perni Nani on mega dsc in vijayawada

విజయవాడ: కూటమి సర‍్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విద్యాశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్‌లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారని తెలిపారు. 

పేర్ని నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్నీ గుట్టుగానే జరుగుతున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి. కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి. ఆన్‌లైన్‌లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి. చదువు రానివాడు చూసినా అర్ధమయ్యే రితీలో ఆన్ లైన్‌లో ఉండాలి. గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చట్టం ఎంత కష్టంగా ఉంటుందో డీఎస్సీ కూడా అలాగే ఉంది.

నారా లోకేశ్‌కి తప్ప డీఎస‍్సీ గురించి ఎవరికీ తెలియదు. స్పోర్ట్స్ కోటా తనకు తెలియదని విద్యాశాఖ కార్యదర్శి చెబుతాడు. సమాచార శాఖ హక్కు చట్టం ప్రకారం స్పార్ట్స్ కోటాలో కొన్ని ప్రశ్నలు అడిగాం. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో రిక్యూట్ మెంట్ కింద ఎంతమందిని తీశారు? ఎంత పర్సెంట్ కి ఎన్ని పోస్టులు తీశారు? ఏ జీవో, ఏ సర్క్యూలర్ కింద పోస్టులు తీశారు? 16 వేల పోస్టుల్లో ఎన్ని పోస్టులు తీసుకున్నారు?  

జిల్లాలో ఏ కేటగిరీ కింద పోస్టులు తీసుకున్నారు. అర్హతకి ఆధారాలు ఏంటీ? సెలక్షన్ ప్రోసిజర్ ఎంటీ? జిల్లా మెరిట్ లిస్ట్, పైనల్ లిస్ట్ కావాలి. స్పోర్ట్స్ కేటగిరీలో వివరాలు అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటాలో ఏ కేటగిరి కింద సెలక్షన్ ఆధారాలు అడిగాం? సెలక్షన్ కమిటీ వివరాలు అడిగాం. స్పోర్ట్ కోటా కింద ఎంతమందిని రిజెక్ట్ చేశారు? ఎందుకు రిజెక్ట్ చేశారు? వంటివి అడిగాం. అభ్యర్థనలు ఏంటీ? అనే కూడా వివరాలు అడిగాం.. డీఎస్సీలో రిక్యూట్ మెంట్ చేయడానికి ప్రభుత్వ అనుమతులు, ఇతర వివరాలు అడిగాం. 

సందేహాలు వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు తీర్చాల్సిన బాద్యత ప్రభుత్వానిది. టెట్ పేపర్ ఎవరు తయారు చేశారు? ఏ ప్రాతిపదికనా వాళ్లను నియమించారు? వాళ్ల సహయకులు ఎవరు అనేది అడిగాం? పైనల్ లిస్ట్ తయారు చేసిన దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారా? వాళ్ల పేర్లు ఇవ్వాలని అడిగాం.  16 అంశాల మీద ఆర్టీఐ వేశాం. చంద్రబాబు, లోకేశ్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో రెచ్చిపోవడం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. పాత స్పోర్ట్ కోటా జీవో మార్పు చేసి 29 నుండి 67గా ఎందుకు మార్పు చేశారు? రెండు శాతం నుండి 3శాతం వరకు ఎందుకు పెంచారు?పరీక్ష పూర్తి అయిన తరువాత ఎందుకు జీవో మార్పు చేశారు. 

యువగళంలో పాల్గొని, లోకేశ్‌తో నడిచిన వాళ్లకు హెరిటెజ్ లో ఉద్యోగాలు ఇచ్చినట్లే ఉద్యోగాలు ఇచ్చేశారు. దొడ్డి దారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు. నిజం నిలకడగానే తెలుస్తుంది.. డీఎస్సీలో తప్పుడు ఇప్పుడు బయటపడ్డాయి. చంద్రబాబుకు, లోకేశ్‌కు దమ్ములేదు. మమ్మల్ని తిట్టే టీచర్లు ప్రెస్ మీట్ పెట్టి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ బయటపెట్టండి. విద్యాశాఖ మంత్రి శాఖను పక్కన పెట్టి.. తప్పుడు పనులకు ప్రయారిటీ ఇస్తున్నారు. కూటమి నేతల పాపాల చిట్టా.. చాలా పెద్దగా ఉంది. తెలంగాణలో కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురుకు ఇచ్చే బదులు రాజ్యసభ సీటు ఇవ్వండి. డబ్బున్న వాళ్లకే ఇస్తారా? డబ్బులేని నందమూరి ప్యామిలీని వాడుకొని వదిలేస్తారా?’’ అని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement