ఓటర్లకు ఆన్‌లైన్‌లో నగదు పంపిణీ

Online cash disbursement to voters - Sakshi

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి నిర్వాకం

సీఎస్‌పీ ద్వారా ఓటర్ల ఖాతాలోకి నగదు మళ్లింపు

పోలీసుల అదుపులో సీఎస్‌పీ నిర్వాహకుడు

హెచ్‌ఎం, పోస్టుమన్‌పై కేసు.. రూ.1,36,000 నగదు స్వాధీనం

తాడిపత్రి అర్బన్‌: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యా­య ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ­చేస్తున్న చామల వెంకట అనిల్‌కుమార్‌రెడ్డి ఉపాధ్యా­యుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమచేసేందుకు య­త్నించి పోలీసులకు దొరికిపోయారు. అనంతపు­రం జిల్లా తాడిపత్రి పట్టణ ఎస్‌ఐ ధరణీబాబు తెలి­పిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో ఉన్న లార్డ్‌ ఆసుపత్రి అధి­నే­త చామల వెంకట అనిల్‌కుమార్‌రెడ్డి పశ్చిమ రాయ­ల­సీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.

అయితే, ఓటమి ఖాయ­మ­ని భావించిన  ఆయన కొత్త పద్ధతుల్లో డబ్బు పంపిణీ­కి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ జిల్లా పోరు­మా­మిళ్ల మండలం కోడిగుడ్లపాడు పాఠశాల ప్రధానో­పాధ్యా­యుడు సాంబశివారెడ్డి, యల్లనూరుకు చెందిన పోస్టుమన్‌ నగేష్‌ ద్వారా తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ (సీఎస్‌పీ)లో శుక్రవారం 28 మంది ఉపాధ్యాయ ఓటర్ల ఖాతాల్లోకి నేరుగా రూ.49 వేల నగదు బదిలీ చేశారు.

ఈ విషయాన్ని తెలు­సు­కు­న్న పట్టణ, రూరల్‌ పోలీసులు దాడులు నిర్వహించి కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ నిర్వాహకుడు శివశంకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. సాంబశి­వారెడ్డి, నగేష్‌ ప్రోద్బలంతో నగదు బదిలీ చేసి­నట్లు అతను అంగీకరించాడు. అతని నుంచి రూ.1,36,­000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అత­ని­­తో పాటు హెచ్‌ఎం సాంబశివారెడ్డి, పోస్టుమన్‌ నగే­ష్‌పై కేసు నమోదు చేశారు.

మరోవైపు.. అనిల్‌­కు­మా­ర్‌రెడ్డికి మద్దతుగా కొండే­పల్లి­కి చెందిన ఉపాద్యా­యు­లు వజ్రగిరి, వైఎస్సార్‌ జిల్లా రైల్వే కొండాపురం మం­డలం బెంజి అనంతపురానికి చెందిన ఉపాధ్యా­యు­డు బత్తల రాజు, పి. నరసింహులుతో పాటు మ­రి­కొందరు కూడా శుక్రవారం తాడిపత్రిలో ఓటర్లకు న­గ­దు పంపిణీ చేపట్టినట్లు పోలీసు విచారణలో తేలింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top