సంక్షేమ సారధిగా.. ప్రజారంజక పాలన

On The Occasion Of Completion padayatra, busstop inaguration in vjd - Sakshi

సాక్షి, విజయవాడ : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా బస్ స్టాప్‌ను ప్రారంభించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ జక్కంపూడి రాజా ,బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు సహా వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  జక్కంపూడి రాజా మాట్లాడుతూ..'ఎవరూ చేయలేని సాహసం వైఎస్‌ జగన్‌ చేవారని, 3648 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్రతో అన్ని వర్గాల ప్రజలతో జగన్‌ మమేకమయ్యారు.

ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూసిన వైఎస్‌ జగన్‌..ప్రజా మేనిఫోస్టోతో ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించారు. అధికారం చేపట్టిన పద్నాలుగు నెలల్లోనే హామీలు నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్. సంక్షేమ రథసారధిగా ప్రజారంజక పాలన అందిస్తున్నారు'  అని కొనియాడారు. సీఎం వైఎస్‌ జగన్‌కు వస్తోన్న ఆధరణను చూసి టీడీపీ తట్టుకోలేకపోతుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. ఇతర రాష్ట్రాలు ఏపీలో సాగుతున్న సంక్షేమ పడకలవైపు చూస్తున్నాయని, సంక్షేమ క్యాలెండర్ అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పేదల ఇంటి వద్దకే చేరుస్తూ.. విద్య ,వైద్యం ,వ్యవసాయం ,శాంతిభద్రతల పరిరక్షణతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. (ప్రజా సంకల్పమే నిత్య స్ఫూర్తి)

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top