గత రెండేళ్లలో రైతులకు రూ.83వేల కోట్ల సాయమందించాం: కన్నబాబు | Sakshi
Sakshi News home page

గత రెండేళ్లలో రైతులకు రూ.83వేల కోట్ల సాయమందించాం: కన్నబాబు

Published Tue, Sep 7 2021 7:55 PM

Minister Kannababu Participated National Level Virtual Review Conducted By Narendrasingh Tomar - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నిర్వహించిన జాతీయ స్థాయి వర్చువల్‌ సమీక్షలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరపున మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకున్న చర్యల గురించి కన్నబాబు ఈ సమావేశంలో వివరించారు. (చదవండి: రైతులకు రెట్టింపు ఆదాయం)

ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయ రంగానికి  చేయూతనివ్వండి. కరోనా వేళ పెద్ద ఎత్తున ఉత్పత్తులను కొనుగోలు చేశాం. రైతు ముంగిట మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. గడిచిన రెండేళ్లలో రైతులకు రూ.83వేల కోట్ల సాయమందించాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు సంక్షేమానికి గడిచిన రెండేళ్లలో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు’’ అని తెలిపారు.(చదవండి: లోకేశ్‌.. పిచ్చి ప్రేలాపనలు వద్దు)

‘‘గ్రామ స్థాయిలో ఆర్‌బీకేలు ఏర్పాటు చేసాం. పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కరోనా కష్టకాలంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం’’ అని కన్నబాబు తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement