జిందాల్‌ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana Comments On Jindal Plant - Sakshi

సాక్షి, గుంటూరు : జిందాల్‌ ప్లాంట్‌ పనులు 2016లో ప్రారంభమయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కేవలం 10% పనులే చేసిందని, మేం అధికారంలోకి వచ్చాక ప్లాంట్‌ పనులు వేగవంతం చేశామని అన్నారు. వచ్చేనెలలో ప్లాంట్‌ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గురువారం జిందాల్‌ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ‘‘ గుంటూరు, విజయవాడ, తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్‌ సహా.. మరో 6 మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్తను ఉపయోగిస్తాం. విశాఖలోనూ ఈ తరహా ప్లాంట్‌ నిర్మాణంలో ఉంది. ఈ ప్లాంట్‌ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది’’ అని తెలిపారు. కాగా, ఈ జిందాల్‌ ప్లాంట్‌ వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్న సంగతి తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top