‘కూటమి నేతలు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తున్నారు’ | Manohar Reddy Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

‘కూటమి నేతలు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తున్నారు’

Apr 30 2026 4:56 PM | Updated on Apr 30 2026 7:00 PM

Manohar Reddy Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్‌బుక్ పేరుతో అణచివేతలు కొనసాగిస్తున్నారని.. పౌర హక్కులను దారుణంగా హరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని వందేళ్ల వెనక్కి నెట్టారు. వ్యవస్థలను ఇష్టానుసారం వాడుకుంటున్నారు. నియంత పాలన రాష్ట్రంలో సాగుతోంది. పోలీసులు ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు జనం బాధ పడుతున్నారు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘యూరియా, డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఇలా అన్నిటికీ కరువు ఏర్పడినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కానీ సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులే మా‌ లక్ష్యం అన్నట్టుగా పని చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు కూడా ఇదే కోవలోనిదే. టెర్రరిస్టును అరెస్టు చేసినట్టుగా రోడ్డుపై అటకాయించి అరెస్టు చేశారు. శ్రీహరి మీద 111 సెక్షన్‌ పెట్టటంపై కోర్టు కూడా ప్రశ్నించింది. కుప్పంలో శ్రీహరికి బెయిల్ రాగానే మరొక కేసు పెట్టి వేధిస్తున్నారు. కుప్పం, కొత్తపేట పీఎస్‌లలో ఒకే రకమైన ఫిర్యాదులు ఇవ్వటం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉంది. ఫిర్యాదులో లేకపోయినా పోలీసులు ఓవరాక్షన్‌తో వైఎస్సార్ సీపీ గూండాలు అంటూ నమోదు చేశారు.

ప్రభుత్వ పెద్దలు ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేలాగ టీడీపీ నేతలే పోస్టులు పెడుతున్నారు. మరి వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. ప్రతిపక్షాలకు ఒక రాజ్యాంగం, అధికార పార్టీ వారికి ఇంకొక రాజ్యాంగం ఉందా?. నిజానికి శ్రీహరికి, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాకు ఎలాంటి సంబంధం లేదు. జర్నలిస్టు శ్రీహరిపై అక్రమంగా కేసులు పెట్టారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం  చేశారు.

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement