Lok Satta Party Chief JP Praises CM YS Jagan Mohan Reddy - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ సంకల్పాన్ని అభినందిస్తున్నా: జేపీ

Sep 5 2022 6:27 PM | Updated on Sep 5 2022 9:06 PM

Lok Satta Party Chief JP Praises CM YS Jagan Mohan Reddy - Sakshi

విశాఖ:  విద్యా, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అభినందించారు. ఏపీలో విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్న జేపీ.. ఇది అభినందనీయమని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్‌ సంకల్పాన్ని అభినందించాలన్నారు.

విశాఖలో అందరికీ ఆరోగ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ... ‘విద్యా, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం మార్పులను అభినందిస్తున్నా. విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తోంది.  సీఎం జగన్‌ సంకల్పాన్ని అభినందిస్తున్నా. ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ లేకుంటే పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్సార్‌ దేశానికే ఒక మార్గం చూపారు. ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్‌ను బాగా అమలు చేయడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement