తెనాలి: ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు వ్యక్తిగతంగా తనకు ఇష్టమేనని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చులకనగా చేసి మాట్లాడటం సరి కాదని హైకోర్టు న్యాయవాదులు పెరికల డేనియల్, వేములపల్లి శ్రీనివాస్ అన్నారు. పట్టణ అయితానగర్‌లో ఆదివారం తన కార్యాలయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం డేనియల్, శ్రీనివాస్ మాట్లాడారు.
గరికపాటి నరసింహారావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెనాలి క్లయింట్ బొప్పూరి పవన్‌కుమార్ అభ్యర్థనతో తాము లీగల్ నోటీసు పంపినట్టు వారు తెలిపారు. తన న్యాయవాది ద్వారా ఆయన తిరుగు సమాధానం ఇచ్చారని కూడా చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం వాక్‌స్వాతంత్య్రానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. వీరితో మరో న్యాయవాది గజ్జ శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు.


