క్ష‌త‌గాత్రులు త్వ‌రగా కోలుకోవాలి | Kishan Reddy Shocked On Vijayawada Fire Accident | Sakshi
Sakshi News home page

విజ‌య‌వాడ ఘ‌ట‌న‌పై కిష‌న్ రెడ్డి దిగ్భ్రాంతి

Aug 9 2020 9:51 AM | Updated on Aug 9 2020 2:46 PM

Kishan Reddy Shocked On Vijayawada Fire Accident - Sakshi

సాక్షి, విజ‌య‌వాడ‌: కరోనా పేషెంట్ల కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన ‌అగ్ని ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని కేంద్ర‌ మంత్రి జి.కిష‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌మాద స్థ‌లంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయ‌న్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు త‌న‌ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాన‌ని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు. మ‌రోవైపు సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మృతి చెందిన కుటుంబాలకు రూ.50ల‌క్ష‌ల ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సేవ‌లందించాల‌ని ఆదేశించారు. (విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం)

(విజయవాడ అగ్ని ప్రమాదం: తొమ్మిది మంది మృతి)

Advertisement
 
Advertisement
Advertisement