అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు
సభలో లేని నేతపై అభ్యంతరకర పదజాలంతో దూషణలు
2019లో రాష్ట్ర ప్రజలు తప్పు చేశారని ప్రజా తీర్పును తప్పు పట్టిన వైనం
మూడు రాజధానుల బిల్లు పెట్టినప్పుడు చంద్రబాబును ఎన్నెన్నో అన్నారు..
అప్పుడు నా చేతిలో గన్ ఉంటే కాల్చేయాలనిపించిందంటూ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదికగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ తప్పతాగిన వ్యక్తిలా రెచ్చిపోయారు. సభలో లేని వారిని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు అసభ్య పదజాలంతో దూషించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ సభకు రాకుండా బయట బ్రోకర్లతో మాట్లాడిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు శనివారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
అడ్డగోలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయకత్వం అవసరమని 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన పవన్‌కళ్యాణ్ బేషరతుగా టీడీపీకి మద్దతిచ్చారని, ఆయన మద్దతుతోనే నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. అయితే 2019లో ప్రజలు తప్పు చేశారని చెప్పారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ పోయినా, దానికి మించిన రాజ«దాని నిరి్మంచుకోవచ్చంటూ ఒక శిల్పిలా చంద్రబాబు కష్టపడి పని చేస్తుంటే.. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నారు.
ఇలా అనకూడదంటూనే పత్రికల్లో రాయలేని పదజాలంతో వైఎస్ జగన్‌ను దూషిస్తూ నోరు పారేసుకున్నారు. నాడు మూడు రాజధానుల బిల్లును శాసన మండలిలో ప్రవేశ పెట్టినప్పుడు గ్యాలరీలో కూర్చున్న నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అన్న మాటలు విని.. తన చేతిలో గన్ ఉంటే అందర్నీ కాల్చేయాలనిపించిందని వ్యాఖ్యానించారు. ‘ఈ రోజు శాసన మండలి ఎందుకు పెట్టడంలేదని అడుగుతున్నారు. బుద్ది, జ్ఞానం ఉందా? తీర్మానం శాసనసభలో చేస్తారు. మండలిలో చేయరు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మండలిలోకి వెళ్తే అడ్డుకోవాలని చూస్తున్నారు.
ఇలాంటి దుర్మార్గులు ఏదో ఒక సందర్భంలో మళ్లీ అధికారంలోకి వస్తారు. అందుకే రాజధానిని మార్చకుండా చట్టబద్ధం చేస్తున్నాం. ఎవరు వచి్చనా అమరావతిని మార్చడానికి వీల్లేని విధంగా పటిష్ట విధానం తీసుకొస్తున్నాం. తొలుత రాజధాని విజయవాడ–గుంటూరు మధ్యలో ఉంటుందని చెప్పాం. తర్వాత అమరావతి అనుకున్నాం. ఈ పేరు లేదు కాబట్టి ఈ ఇబ్బందులు. అందుకే ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం’అని చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు మాట్లాడిన కొన్ని మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.


