‘ఫేక్ కార్డులు సృష్టించి అక్రమంగా నిధులు కాజేస్తున్నారు’ | Kadapa MP Avinash Reddy On Employment Guarantee Scheme | Sakshi
Sakshi News home page

‘ఫేక్ కార్డులు సృష్టించి అక్రమంగా నిధులు కాజేస్తున్నారు’

May 14 2025 9:36 PM | Updated on May 14 2025 9:43 PM

Kadapa MP Avinash Reddy On Employment Guarantee Scheme

వైఎస్సార్ జిల్లా: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్ర మంత్రికి, జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, చేయని పనులకు కూడా బిల్లులు చేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న వారిని సైతం మస్టర్లలో చూపుతున్నారని, ఫేక్ కార్డులు సృష్టించి అక్రమంగా నిధులు కాజేస్తున్నారన్నారు. 

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఉపాది హామీ ఉద్దేశమే దెబ్బ తింటోందని అవినాష్ రెడ్డి తెలిపారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారణ చేపట్టాలన్నారు. నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతూ అసలు లబ్ధిదారులు నష్టపోతున్నారన్నారు. పేద వాడికి చట్ట ప్రకారం అందాల్సిన ఉపాధికి గండి కొడుతున్నారని, ఈ అంశంపై వెంటనే కల్పించుకుని అక్రమాలను నిగ్గుతేల్చాలన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement