వైఎస్ జగన్‌ను కలిసిన కడప అమీన్ పీర్ దర్గా ప్రతినిధులు | Kadapa Ameen Peer Dargah Representatives meet YSRCP Chief YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ను కలిసిన కడప అమీన్ పీర్ దర్గా ప్రతినిధులు

Oct 13 2026 5:27 PM | Updated on Oct 13 2026 5:55 PM

Kadapa Ameen Peer Dargah Representatives meet YSRCP Chief YS Jagan

తాడేపల్లి :  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కడప అమీన్‌ పీర్‌ దర్గా ప్రతినిధులు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివానంలో కడప అమీన్‌ పీర్‌ దర్గా ప్రతినిధులు కలిసి ఉర్సు ఉత్సవాలకు ఆహ్వానం అందించారు. ఈ నెల 24 నుండి జరుగనున్న ఉర్సు ఉత్సవాలకు రావాల్సిందింగా వైఎస్‌ జగన్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో దర్గా పీఠాధిపతి  ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ, చీఫ్ ముజావర్ అమీరుద్దిన్, ఇతర ప్రతినిధులు ఉన్నారు. 

దీనిలో భాగంగా వారికి ఉర్సు ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ సూచించారు. ‘మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పవిత్ర స్థలం కడప అమీన్ పీర్ దర్గా. అన్ని వర్గాల ప్రజలు భక్తిశ్రద్ధలతో దర్గాను దర్శించుకుంటారు. హిందూ–ముస్లిం ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావమే మన సమాజ బలం. మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా ఉర్సు ఉత్సవాలు నిలవాలి.  అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనాలి. సామరస్య సందేశాన్ని చాటాలి’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:  ఆ తల్లి ఆవేదనకు చలించిపోయిన వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement