ఒకరు సివిల్ ఎస్‌ఐ.. మరొకరు మైరెన్ ఎస్‌ఐ
కోడూరు: ఒకరేమో కోడూరు పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ చాణిక్య.. మరొకరేమో పాలకాయతిప్ప మైరెన్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ పూర్ణమాధురి. వీరిరువురు భార్యభర్తలు. ప్రస్తుతం ‘మోంథా’ తుఫాన్ నేపథ్యంలో భార్యభర్తలిద్దరికీ కోడూరు జెడ్పీ పాఠశాలలో ప్రభుత్వం తీర ప్రాంత ప్రజల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో డ్యూటీ పడింది. అటు పోలీసు, ఇటు మైరెన్ శాఖలను భార్యభర్తలిద్దరు సమన్వయం చేసుకుంటూ తమ విధులు నిర్వర్తించారు.


