తిరుమలలో కుండపోత వర్షం | Heavy Rainfall In TIrumala Devotees Face Severe Hardships | Sakshi
Sakshi News home page

తిరుమలలో కుండపోత వర్షం

Jun 1 2026 4:01 PM | Updated on Jun 1 2026 4:31 PM

Heavy Rainfall In TIrumala Devotees Face Severe Hardships

తిరుమల: తిరుమల కొండపై కుండపోతగా వర్షం కురుస్తోంది. రెండు గంటలకు పైగా వర్షం కురుస్తోంది. దాంతో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన ప్రాంతాలన్నీ జలమయంగా మారడంతో భక్తులు అగచాట్లు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నా.. తిరిగి వసతి ప్రాంతాలకు వెళ్లాలన్నా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.  

తిరుమలలో ఉన్నపళంగా వాతావరణం మారిపోయి వర్షం పడటం ఆరంభించింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో తిరుపతి నగరంలో కూడా రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. దాంతో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement