‘కొలీజియం నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు’

Governments Nothing To Do With Collegium Decisions AAG Ponnavolu - Sakshi

విజయవాడ: కొలీజియం నిర్ణయాలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కొలీజియం నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేనన్నారు. న్యాయ వ్యవస్థలో కుల ప్రస్తావన రావడం దురదృష్టకరమన్నారు.

న్యాయ వ్యవస్థపై దాడి మంచిది కాదని శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నవోలు తెలిపారు. ‘ స్థాయి లేని వ్యక్తులు సీఎంను విమర్శించడం ఫ్యాషన్‌ అయ్యింది. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి జడ్జిల బదిలీతో సంబంధమేంటి?,కొలీజియం అనేది స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థ. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనివారే ఆందోళన చేశారు’ అని అన్నారు.

ఇదిలా ఉంచితే, తాము హైకోర్టు విధుల బహిష్కరణకు పిలుపు ఇవ్వలేదని ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. న్యాయవాదులు సమ్మె చేయడం, విధులు బహిష్కరించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. విధులు బహిష్కరిస్తూ కొంతమంది చేసిన తీర్మానంతో అసోసియేషన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top