మాజీ సైనికుడి ఆత్మహత్యాయత్నం | ex army soldier suicide attempt: Annamaiya district | Sakshi
Sakshi News home page

మాజీ సైనికుడి ఆత్మహత్యాయత్నం

Dec 10 2024 5:49 AM | Updated on Dec 10 2024 5:49 AM

ex army soldier suicide attempt: Annamaiya district

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బ్లేడుతో గొంతుకోసుకునే యత్నం

మదనపల్లె : మాజీ సైనికుడి కోటాలో మంజూరైన భూమిని సబ్‌ డివిజన్‌ చేయాలని కోరితే.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ తహసీ­ల్దార్‌ కార్యాలయంలో ఓ మాజీ సైనికుడు ఆత్మహ­త్యకు యత్నించాడు. అన్నమయ్య జిల్లా మదన­పల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం జరుగు తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య క్రమంలో రామచంద్ర బ్లేడ్‌తో గొంతుకో­సుకుని ఆత్మహత్యకు యత్నించాడు

అధికారులు, పోలీసు లు వెంటనే అడ్డుకుని అతడిని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. రామచంద్ర మాట్లాడుతూ 2006లో తనతో పాటు మాజీ సైనికులైన మరో ఇద్దరికి వెంకప్పకోట పంచాయతీలో డీకేటీ పట్టాలు మంజూరు చేసినట్టు తెలిపారు.  తమ స్థలానికి పక్కనే టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుండటంతో దానికి రోడ్డు అవసరమై కింద ఉన్న ఇద్దరు సైనికుల భూములకు స్కెచ్‌లతో పాటు ఎన్‌ఓసీని రెవెన్యూ అధికారులు మంజూరుచేసినట్టు తెలిపారు.

వారికి ఆనుకుని ఉ న్న తన భూమి సర్వే నంబర్‌ను రీ సర్వేలో భాగంగా తొలగించారని, దీనిపై  ఐదేళ్లుగా కార్యాలయం చు ట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  దీంతో ఆత్మహత్య చేసు కోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తహ సీల్దార్‌ ఖాజాబీ మాట్లాడుతూ   స్కెచ్‌ల ఆధారంగా రామచంద్రకు న్యాయం చేస్తామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement