పచ్చ కుట్రలు పటాపంచలు! | The evil four including Chandrababu Naidus propaganda is exposed one by one | Sakshi
Sakshi News home page

పచ్చ కుట్రలు పటాపంచలు!

Sep 29 2025 5:45 AM | Updated on Sep 29 2025 7:17 AM

The evil four including Chandrababu Naidus propaganda is exposed one by one

చంద్రబాబు సహా దుష్ట చతుష్టయం దుష్ప్రచారాలు ఒక్కొక్కటిగా బట్టబయలు 

వైఎస్‌ జగన్‌ తనను సాదరంగా ఆహ్వానించి గౌరవించారన్న మెగాస్టార్‌ చిరంజీవి 

ఇన్నాళ్లూ పవన్‌ కళ్యాణ్‌ చేసిందంతా విష ప్రచారమేనని చాటి చెప్పిన చిరంజీవి లేఖ 

తద్వారా వైఎస్‌ జగన్‌ సినీ ప్రముఖులను అవమానించారన్నది దు్రష్పచారమే

అధికారంలోకి వచ్చాక 16 నెలల్లోనే రూ.2.09 లక్షల కోట్లు అప్పు చేశారు.. హామీలు మాత్రం గాలికొదిలేశారు 

సంపద సృష్టిస్తామని చెప్పి ఉన్న సంపదనూ ఊడ్చేస్తున్నారు

వలంటీర్ల వ్యవస్థకు మంగళం.. ఎండీయూ ఆపరేటర్లను ఇంటికి పంపారు

కమీషన్లు వచ్చే పనులకే పెద్దపీట.. మొబిలైజేషన్‌ అడ్వాన్సులతో మీకింత–నాకింత

మాఫియాగా మారి ఇసుక, గ్రావెల్, క్వార్ట్‌జ్‌ దోపిడీ 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నోరెత్తడం లేదు

ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను వెళ్లగొడుతున్నారు

పోలవరాన్ని 41.15 మీటర్లకే పరిమితం చేసి బ్యారేజ్‌గా మార్చారు

సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేశ్‌ దుష్ప్రచారం చేశారు. ఆ అబద్ధాలకు ఈనాడు సహా ఎల్లో మీడియా శక్తి వంచన లేకుండా ప్రచారం కల్పించి ప్రజలు నమ్మేలా వారికి బాకాలూదింది. ఈ దుష్టచతుష్టయ దుష్ప్రచారం ఎన్నికల ప్రచారం నాటికి తార స్థాయికి చేరింది. గోబెల్సే సిగ్గుతో తలదించుకునే రీతిలో నిత్యం తప్పుడు ప్రచారాలు, కథనాలతో నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో విషాన్ని నింపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసింది. మోసపు హామీలే పెట్టుబడిగా టీడీపీృజనసేన కూటమి ఎన్నికల్లో విజయం సాధించింది.

సీన్‌ కట్‌ చేస్తే.. 
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే.. 2019ృ24 మధ్య తాము చేసిందంతా దుష్ప్రచారమేనని తనకు తానుగానే చాటుకుంటోంది. దుష్టచతుష్టయం దుష్ప్రచారం బట్టబయలవుతుండటంతో ప్రజలు నిర్ఘాంతపోతున్నారు. అసలు నిజాలు తెలుసుకుని కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించడానికి వెళ్లిన తన అన్నను వైఎస్‌ జగన్‌ అవమానించారంటూ ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని గురువారం విడుదల చేసిన లేఖ ద్వారా మెగాస్టార్‌ చిరంజీవే స్వయంగా చాటి చెప్పారు.  

సాక్షి, అమరావతి: దుష్ప్రచారమే ఆయుధంగా.. మోసపు హామీలే పెట్టుబడిగా పెట్టి, అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కార్‌ 16 నెలలుగా ప్రజ­లను దగా చేస్తోంది. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అంటూ 143 హామీలను ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటిని బుట్ట­దాఖ­లు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ నాదంటూ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు నమ్మబలికిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పు­డు నోరు మెదపడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, నాటి సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్టచతుష్టయంలా తాము చేసిన దుష్ప్రచారం గుట్టంతా రట్టవుతుండటం, తమ బాగోతం బట్టబయలవుతుండటంతో.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. 

వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగించడంతోపాటు మరింత అధికంగా ప్రయోజనం చేకూర్చుతానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు పప్పులూ బెల్లాల్లా డబ్బులు పంచిపెడుతూ వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ ఎన్నికలకు ముందు విషం కక్కిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 2.09 లక్షల కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించారు. 

అంత అప్పు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయక పోవడం గమనార్హం. వీటన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో డప్పు కొడుతున్న చంద్రబాబుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తాళం వేస్తున్నారు. ఆ డైవర్షన్‌ పాలిటిక్స్‌ను రక్తి కట్టించేందుకు సనాతన ధర్మం అంటూ ఒకసారి.. సీజ్‌ ద షిప్‌ అంటూ మరోసారి.. ‘షో’ చేస్తూ డ్రామాలాడుతున్నారు. 

మరోవైపు ఇసుక నుంచి సిలికా వరకూ టీడీపీ–జనసేన మాఫియా సహజ వనరులను దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతూ.. హామీల అమలు, పరిపాలన వైఫల్యాలపై ప్రశి్నంచే గొంతులను రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో నొక్కేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో వారి కుట్రల లోగుట్టు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్న తీరు ఇలా ఉంది.

వైఎస్‌ జగన్‌ గౌరవించారు.. చిరంజీవి తాజా లేఖే నిదర్శనం  
దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. 
సినిమా పరిశ్రమ సమస్యలను చర్చించేందుకు వెళ్లిన తన అన్న చిరంజీవిని సీఎం వైఎస్‌ జగన్‌ అవమానించారంటూ ఎన్నికలకు ముందు సభల్లో పవన్‌ కళ్యాణ్‌ ఊగిపోయారు. ఇదే అంశంపై చంద్రబాబు, లోకేశ్, ఎల్లో మీడియా పవన్‌కు వంత పాడుతూ విష ప్రచారం చేశారు.  

బట్టబయలైన వాస్తవం: ఇదే అంశాన్ని గురువారం శాసనసభలో బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్‌ ప్రస్తావిస్తూ వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడారు. దీనిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ జోక్యం చేసుకుంటూ.. సినీ రంగంలో మెగాస్టార్‌గా వెలిగిపోతున్న చిరంజీవిని ఉద్దేశించి ‘వాడెవడు’ అంటూ తూలనాడారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ గురువారం సాయంత్రం లేఖ విడుదల చేశారు. తాను ఇండియాలో లేను కాబట్టే ఆ ప్రకటనను విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. 

సినీ పరిశ్రమలో సమస్యలపై చర్చించేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనను సాదరంగా ఆహ్వానించినట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలోనే తాను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని అప్పటి సీఎం జగన్‌కు వివరించినట్టు స్పష్టం చేశారు. ‘ఆ తర్వాత సినీ ప్రముఖులతో కలిసి సమస్యలపై చర్చించడానికి వైఎస్‌ జగన్‌ వద్దకు వెళ్లాం. వైఎస్‌ జగన్‌ మమ్మల్ని సాదారంగా ఆహ్వానించారు.. గౌరవించారు. 

సినీ ప్రముఖుల అందరి సమక్షంలోనే నాటి సీఎం వైఎస్‌ జగన్‌కు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించి సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యం. నేను ఆ చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది’ అని ఆ లేఖలో స్పష్టం చేశారు.  పవన్‌ కళ్యాణ్‌ ఇతరులతో కలిసి చేసిందంతా దుష్ప్రచారమేనని ఆ లేఖ ద్వారా అర్థమైంది.  

అప్పు రూ.14 లక్షల కోట్లు కాదు.. రూ.3.78 లక్షల కోట్లే 
దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థి క విధ్వంసం సృష్టించిందని.. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేసిందంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబు తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా ఇందుకు వంత పాడుతూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారంటూ తప్పుడు కథనాలను వండివార్చింది. 

బట్టబయలైన వాస్తవం: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు అంటూ ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని వెల్లడించారు. 2024–25 బడ్జెట్‌ ప్రవేశపెడితే.. రాష్ట్ర అప్పుపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే నెపంతో జాప్యం చేశారు. చివరకు గతేడాది నవంబర్‌ 11న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు. కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దు్రష్ఫచారం చేస్తూనే వచ్చారు. 

మొన్నటికి మొన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన మార్చి 28న రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు అంటూ చంద్రబాబు బొంకారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ, నాన్‌ గ్యారెంటీ అప్పు మొత్తం కలిపి 2025 మార్చి నాటికి రూ.6,77,849.80 కోట్లేనని అసెంబ్లీలో ఈనెల 23న లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆర్థి క మంత్రి పయ్యావుల కేశవ్‌ అంగీకరించారు. ఇందులో 2014–19 మధ్య అంటే.. నాటి చంద్రబాబు సర్కార్‌ చేసిన అప్పు రూ.3,06,952.26 కోట్లు. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,78,897.54 కోట్లేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ స్పష్టం చేశారు. 

అందులో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.73 లక్షల కోట్లను నాటి సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేశారు. 2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 16 నెలల్లో రూ.2,09,085 కోట్లు అప్పు చేసింది. చెప్పిన విధంగా సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలను అమలు చేయలేదు.. అప్పుగా తెచ్చిన రూ.2,09,085 కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయో! అంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 16 నెలల్లోనే కూటమి సర్కార్‌ 56 శాతం అప్పు చేయడం గమనార్హం. దీన్నిబట్టి అప్పుల సామ్రాట్‌ చంద్రబాబేనని స్పష్టంగా తెలుస్తోంది.  

ఆర్థిక మంత్రి.. అసెంబ్లీ సాక్షిగా.. 
అప్పులపై చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా అసెంబ్లీ సాక్షిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ నిజాలను చెప్పాల్సి వచ్చింది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్‌తోపాటు గ్యారెంటీ కలిపి మొత్తం అప్పు రూ.3,06,952.26 కోట్లుగా ఉందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,70,897 కోట్లేనని అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన ఆర్థి క మంత్రి పయ్యావుల కేశవ్‌.

మహిళల అక్రమ రవాణా ఉత్తుత్తే
దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. 
ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక రీతిలో ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మారు. 2.60 లక్షల మంది వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకు పింఛన్లు మొదలు అన్ని రకాల ప్రభుత్వ సేవలను ప్రభుత్వం అందించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో వలంటీర్ల ద్వారా 35 వేల మంది మహిళలను మాయం చేసి.. అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ ఎన్నికల ముంగిట పవన్‌ కళ్యాణ్‌ దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు సైతం ఇదే రీతిలో వలంటీర్లపై విషం కక్కారు.  

బట్టబయలైన వాస్తవం: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్‌ 16న అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు కేవలం 34 నమోదు అయ్యాయని.. 46 మంది బాధితులని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ద్వారా కూటమి కుట్ర బట్టబయలైంది. నాడు పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు చేసిందంతా దుష్ప్రచారమేనని కూటమి ప్రభుత్వమే కుండబద్ధలు కొట్టింది.  

నాడు ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై విషం.. ఇప్పుడు భూముల రీ సర్వేపై యూటర్న్‌  
దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. 
గత 40 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెబుతున్న  ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తొలిసారిగా రాష్ట్రంలో తెస్తే చంద్రబాబు దానిపై రాజకీయ కుట్రతో దుష్ప్రచారం చేశారు. ప్రజల భూములు లాక్కునేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని అబద్ధాలతో ప్రజలను భయాందోళనలకు గురి చేశారు.  

బట్టబయలైన వాస్తవం: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ భూముల రీ సర్వే చేపట్టారు. 13 వేల గ్రామాలకుగానూ 8 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి డిజిటల్‌ రికార్డులు అందబాటులోకి తెచ్చారు. ప్రతి రైతుకు ఒక యూనిక్‌ ఐడీ నంబర్‌ ఇవ్వడంతోపాటు భూములను జియో ట్యాగింగ్‌ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. రీ సర్వే చేసి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే ఎవరూ ఆ భూమి తనదని కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ఉండదు.  అయితే చంద్రబాబు ఎన్నికల్లో దాన్ని ఒక అస్త్రంగా వాడుకుని ఎడతెగని దుష్ప్రచారంతో లబ్ధి పొందారు. 

తాను చెప్పిన అబద్ధాలను నిజమని చెప్పుకునేందుకు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఈ చట్టంతో ముడిపడి ఉన్న భూముల రీ సర్వేను కూడా రద్దు చేయాలని ప్రయతి్నంచారు. కానీ అది విజయవంతమవడం, కేంద్ర ప్రభుత్వం జగన్‌ హయాంలో చేపట్టిన సర్వేకు ఇప్పుడు రూ.500 కోట్ల వరకు నిధులు విడుదల చేయడంతో యూటర్న్‌ తీసుకుని కొనసాగిస్తున్నారు.

సంపద సృష్టి కాదు.. ఉన్నది ఆవిరి  
దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. 
వైఎస్‌ జగన్‌ భారీ ఎత్తున అప్పులు తెచ్చి.. పప్పులూ బెల్లాల్లా పేదలకు పంచిపెడుతున్నారని, సంపద సృష్టించకుండా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, ఎల్లో మీడియా తీవ్ర స్థాయిలో విషప్రచారం చేసింది. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టించి.. పథకాలు అమలు చేస్తానంటూ నమ్మబలికారు. 

బట్టబయలైన వాస్తవం:  నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేశారు. లోక్‌సభ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో.. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్‌ జగన్‌ చేపట్టారు. 2023–24లో ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభించి.. 750 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25లో మరో ఐదు కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధం చేశారు. 

కానీ.. కూటమి సర్కార్‌ ఒక కాలేజీ మాత్రమే ప్రారంభించి.. 50 సీట్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. మిగతా మెడికల్‌ కాలేజీల పనులను ఆపేసింది. ప్రైవేటుపరం ముసుగులో సన్నిహితులు, బినామీలకు వాటిని కట్టబెట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. జగన్‌ చేపట్టిన పోర్టులను సైతం ౖప్రైవేటుపరం చేస్తూ దోపిడీ చేస్తున్న చంద్రబాబు కూటమి సర్కారు తీరుతో ఉన్న సంపద ఆవిరవుతోంది.  

నాడు తప్పు పట్టారు.. నేడు పారదర్శకతకు పాతరేశారు
దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. 
ప్రజలకు సుపరిపాలన అందించడానికి 2014–19 మధ్య తాము తెచ్చిన సంస్కరణలను వైఎస్‌ జగన్‌ రద్దు చేశారంటూ 2019లో అధికారం నుంచి దిగిపోయినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం వరకూ చంద్రబాబు విషప్రచారం చేస్తూ వచ్చారు. 

బట్టబయలైన వాస్తవం:  వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి.. 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేసింది. ఇంటి వద్దకే రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వ్యవస్థను రద్దు చేసింది. దాంతో 9,280 మంది ఎండీయూ ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు సహా అభివృద్ధి పనుల అంచనా వ్యయం, టెండర్లను పారదర్శకంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన జ్యుడిíÙయల్‌ ప్రివ్యూ వ్యవస్థ, రివర్స్‌ టెండరింగ్‌ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 

2014–19 తరహాలోనే టెండర్ల వ్యవస్థను నీరుగార్చి సన్నిహితులు, బినామీలకు పనులు అప్పగిస్తోంది. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సు ముట్టజెప్పే విధానాన్ని వైఎస్సార్‌సీపీ రద్దు చేస్తే, కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి మళ్లీ ఆ విధానాన్ని ప్రవేశపెట్టింది.  నీకింత నాకింత అంటూ కమీషన్లు దండుకుంటోంది.  

నాడు సర్కారుకు ఆదాయం.. నేడు కూటమి నేతలకు ఆదాయం 
దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. 
ఇసుక నుంచి మట్టి వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేస్తోందని విషం చిమ్మిన చంద్రబాబు, ఎల్లో మీడియా.  

బట్టబయలైన వాస్తవం: వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం ఐదేళ్లలో తక్కువ ధరలకు ఇసుకను సరఫరా చేసింది. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదా­యం వచ్చింది. 2024 అవసరాల కోసం 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ పెట్టింది. కూటమి నేతలు ఆ ఇసుక నిల్వలన్నింటినీ దోచేసి జేబులు నింపుకున్నారు. ఉచిత ఇసుక ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టి చట్టాలను ఉల్లంఘించారు. 

లిక్కర్‌ నుంచి సిలికా, క్వార్ట్‌జ్‌ వరకూ వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది.  ఊరూ పేరూ లేని ఉర్సా అనే సంస్థకు రూపాయికి ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. లులూ సంస్థకు మాల్‌ కట్టడానికి విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండటం భూ దోపిడీకి పరాకాష్ట.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నేడు పెగలని నోరు
దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. 
విశాఖ స్టీల్‌ పరిశ్రమను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తుంటే సీఎం వైఎస్‌ జగన్‌ నోరు మెదపడం లేదంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్, లోకేశ్‌ దుష్ప్రచారం చేశారు.

బట్టబయలైన వాస్తవం: 2025 జనవరి 17న కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని స్పష్టం చేశారు. నాటి సీఎం వైఎస్‌ జగన్‌ వ్యతిరేకించకపోతే.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ ఎప్పుడో పూర్తయ్యేదని కుండబద్ధలు కొట్టారు. 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో 32 విభాగాలను ప్రైవేటుపరం చేస్తూ ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన) టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు.  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత ఇనుప ఖనిజ గని కేటాయించాలని కోరడానికి మనస్కరించని సీఎం చంద్రబాబు ప్రైవేటు స్టీల్‌ ప్లాంట్‌కు సొంత ఇనుప ఖనిజ గని కేటాయింపునకు పాటుపడ్డారు.

నాటి సర్కారు ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్న కూటమి 
దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. 
వైఎస్సార్‌సీపీ సర్కారు తీరు వల్ల పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. 

బట్టబయలైన వాస్తవం: నెల్లూరు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు మూత పడుతున్నా కూటమి సర్కారు మొద్దు నిద్ర నటిస్తోంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ఓ భారీ పీఎస్‌యూ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ని్రష్కియాపరత్వంతో చాప చుట్టేసే పనిలో ఉంది.  2019–24 మధ్య రూ.3.02 లక్షల కోట్ల పెట్టుబడులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాస్తవ రూపంలోకి తెచ్చిందని ప్రభుత్వ గణాం­కాలే చెబుతున్నాయి. 

రూ.85,543 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 163 భారీ పరిశ్రమలు అప్పట్లోనే ఉత్పత్తి ప్రారంభించాయి. ఒప్పందం జరిగిన పెట్టుబడుల్లో అప్పటికే రూ.2.46 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వురు దశల్లో ఉన్నాయి. ఇప్పుడు కూటమి వాటిని తన ఘనతగా చెప్పుకుంటోంది.  

నాడు రూ.2.49 అధికం అన్నారు.. నేడు రూ.3.20తో కొంటున్నారు 
దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. 
సెకీతో విద్యుత్‌ను అత్యధిక ధరకు (యూనిట్‌ రూ.2.49) వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల భారం అదనంగా పడుతుందని ఎన్నికలకు ముందు చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం విష ప్రచారం చేసింది.   

బట్టబయలైన వాస్తవం:  ఈ కుట్రలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పటాపంచలు చేసింది. సెకీ ఒప్పందం సక్రమమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అదే సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3.20 చొప్పున చెల్లించి కొంటున్నారంటే దాని వెనుక ఎంతటి అవినీతి దాగుందో వేరేగా చెప్పనవసరం లేదు. 

పోలవరాన్ని బ్యారేజ్‌గా మార్చేశారు  
దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. 
పోలవరం ప్రాజెక్టును వైఎస్‌ జగన్‌ బ్యారేజ్‌గా మార్చేశారంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు విష ప్రచారం చేశారు.   

బట్టబయలైన వాస్తవం: కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే కట్టాల్సిన పోలవరాన్ని 2016 సెపె్టంబర్‌ 8న 2013–14 ధరలతో 2010–11 నాటి పరిమాణాలతో పూర్తి చేస్తానని కేంద్రంతో నాటి సీఎం చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. దీని వల్ల పోలవరానికి రూ.20,398 కోట్లకు మించి పైసా కూడా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. వాస్తవానికి అప్పటికి పోలవరం అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు. 

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక కేంద్రానికి వాస్తవ పరిస్థితులను వివరించి..  తాజా ధరల మేరకు నిధులు ఇస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని కేంద్రాన్ని ఒప్పించారు.  కానీ.. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసింది. అయినా చంద్రబాబు ఈ అంశంపై నోరు మెదపలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement