
జాషువా విగ్రహానికి పూలమాల వేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
వైఎస్సార్‌సీపీ నేతల ఘన నివాళి
పార్టీ కేంద్ర కార్యాలయంలో జాషువా జయంతి వేడుకలు
సాక్షి,అమరావతి: కుల, మత అసమానతల్లేని సమసమాజ నిర్మాణం కోసం కలంతో పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా అని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు కొనియాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాషువా జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు.
అనంతరం వారు మాట్లాడుతూ..ఆధునిక తెలుగు కవుల్లో అగ్రగణ్యుడు గుర్రం జాషువా అని అన్నారు. జాషువా భౌతికంగా మనమధ్య లేకపోయినా తన రచనలతో సమాజాన్ని నిత్యం తట్టిలేపుతూనే ఉంటారన్నారు. స్వేచ్ఛ, సమాన త్వం ఉన్నప్పుడు సమాజం పురోభివృద్ధి సాధిస్తుందని జాషువా నమ్మారని, ఆ స్ఫూర్తిని మాజీ సీఎం వైఎస్ జగన్ మరింతగా ముందుకు తీసుకువెళ్లారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన..
షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా విద్య, వైద్య రంగా ల్లో కూటమి అనుసరిస్తోన్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 30న వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలపనున్నట్లు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు మాట్లాడుతూ బలహీ న కులాలను ప్రభుత్వం అణచివేస్తోందన్నారు.