ఇదేనా తొలిసంతకం విలువ? కూటమి సర్కార్‌పై ఆగ్రహ జ్వాలలు | DSC Aspirants Protest At Avanigadda Against Kutami Prabhutvam | Sakshi
Sakshi News home page

‘‘మెగా డీఎస్సీ ఎక్కడ?.. ఇదేనా తొలిసంతకం విలువ?’’

Jan 28 2025 2:20 PM | Updated on Jan 28 2025 3:41 PM

DSC Aspirants Protest At Avanigadda Against Kutami Prabhutvam

కృష్ణా, సాక్షి: అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా మెగా డీఎస్సీ ఊసేత్తడం లేదు కూటమి ప్రభుత్వం. దీంతో.. అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. తాజాగా.. మంగళవారం అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్ధులు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. 

‘‘కూటమి ప్రభుత్వం డీఎస్పీ అభ్యర్ధులను నయవంచన చేస్తోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. తక్షణమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రకటించాలి. పరీక్షల తేదీతో సహా ప్రకటన చేయాలి ... లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం అని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న హెచ్చరించారు. మరోవైపు.. డీఎస్సీ అభ్యర్ధులు సైతం కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం తొలి సంతకానికి ఉన్న విలువ ఇదేనా?. ఆరునెలల్లో మెగా డీఎస్పీ పూర్తిచేస్తామన్నారు. కనీసం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో చెప్పడం లేదు. తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి’’ అని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో.. అవనిగడ్డ గ్రంధాలయం నుంచి వంతెన సెంటర్ వరకూ ప్లకార్డులతో నిరనన ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement