Crime Rate In AP: ఏపీలో ఈ ఏడాది భారీగా తగ్గిన క్రైం రేట్‌

DGP Rajendranath Reddy Said Crime Rate Has Decreased In AP - Sakshi

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

సాక్షి, విజయవాడ: ఏపీలో క్రైమ్‌  రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మెరుగైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గించగలిగామన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా పెద్ద ఎత్తున కేసులు పరిష్కరిస్తున్నాం. 1.08 లక్షల కేసులు పరిష్కరించాం. చోరీ కేసుల్లో రికవరీ శాతం బాగా పెరిగిందని డీజీపీ పేర్కొన్నారు.

‘‘గతేడాది 2,84,753 కేసులు నమోదు కాగా, 2022లో 2,31,359 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2021లో 945 హత్య కేసులు నమోదు కాగా, 2022లో 857 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు 2021లో 19,203 జరగగా 2022 లో 18739 ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ లను గుర్తించి నివారణా చర్యలు చేపట్టాం. కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని ఈ సంవత్సరం జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి సీపీ/ ఎస్పీ తమ పరిధిలోని అత్యంత ముఖ్యమైన ఐదు కేసులు(మహిళలకు సంబంధించిన కేసులకు మొదటి ప్రాధాన్యత) పర్యవేక్షణ చేస్తారు’’ అని డీజీపీ వివరించారు.

‘‘ప్రతి రోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశాం ఈ విధానం ద్వారా కేసు ట్రైల్ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్ష పడేవిధంగా చేయొచ్చు. అంతేకాకుండా ఏ ఒక్క నేరస్థుడు తప్పించుకోకుండా చూడటం ముఖ్య ఉద్దేశం’’ అని రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: కథ.. ​స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top