Sri SathyaSai District: చెన్నేకొత్తపల్లికి సీఎం జగన్‌

CM YS Jagan will Arrive in Chennekothapalli Sri Sathya Sai District - Sakshi

చెన్నేకొత్తపల్లి (శ్రీసత్యసాయి జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లికి రానున్నారు. ఇక్కడ నిర్వహించే బహిరంగ సభ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పంట బీమా సొమ్మును కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం ప్రోగాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎస్పీలు ఫక్కీరప్ప, రాహుల్‌దేవ్‌ సింగ్‌ చెన్నేకొత్తపల్లిలో పర్యటించారు.

సీఎం సభాస్థలి, హెలీప్యాడ్‌ కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో తలశిల రఘురాం, కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. సభ కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డి, ఎంపీపీ శ్రీశైలం ప్రవీణ తదితరులు ఉన్నారు.  

చదవండి: (12న కావలికి సీఎం వైఎస్‌ జగన్‌ రాక?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top