ఎల్లుండి బియ్యం పంపిణీ వాహనాల ప్రారంభం | CM YS Jagan To Start of rice distribution vehicles on 21st Jan | Sakshi
Sakshi News home page

ఎల్లుండి బియ్యం పంపిణీ వాహనాల ప్రారంభం

Jan 19 2021 4:00 AM | Updated on Jan 19 2021 8:04 AM

CM YS Jagan To Start of rice distribution vehicles on 21st Jan - Sakshi

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఇంటింటికీ రేషన్‌ బియ్యం సరఫరా చేసే వాహనాలను ఈనెల 21వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారని కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత చెప్పారు.

సోమవారం విజయవాడలో వాహనాల డ్రైవర్లు, వీఆర్‌వోలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. మాధవీలత మాట్లాడుతూ.. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన 2,503 డోర్‌ డెలివరీ వాహనాలను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. 20వ తేదీ రాత్రి 9 గంటలకు విజయవాడలోని బందర్‌ రోడ్డుపై ఒకొక్క వరుసలో 625 వాహనాల చొప్పున నాలుగు వరుసల్లో వాహనాలను నిలపాలని డ్రైవర్లకు సూచించారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వీఆర్‌వోలను ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement