సమష్టిగా నడుద్దాం.. క్లీన్‌ స్వీప్‌ చేద్దాం

CM Jagan directions to vijayawada east constituency YSRCP activists - Sakshi

విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

వచ్చే ఎన్నికలను సీరియస్‌గా తీసుకుందాం

మన లక్ష్యం 152 కాదు.. 175 స్థానాలు

ఈ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే 30 ఏళ్లూ అధికారం మనదే

అభిప్రాయ భేదాలుంటే పక్కన పెట్టి కలిసికట్టుగా పని చేయండి

విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్‌ను గెలిపించండి

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అంతా సమష్టిగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో అన్ని శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని విజయవాడ తూర్పు నియో­జకవర్గ కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా బటన్‌ నొక్కి డీబీటీ(ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో 88 శాతం కుటుంబాలకు మంచి చేశామని.. విద్య, వ్యవసాయ, వైద్య రంగా­లలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని.. వికేంద్రీకరణ ద్వా­రా సుపరిపాలన అందిస్తున్నామని వివరించారు. దాంతో ప్రజల్లో మార్పు ప్రస్ఫుటంగా కన్పిస్తోందన్నారు.

గడప గడప­కూ వెళ్లి.. ప్రజలతో మమేకమై.. చేస్తున్న మంచిని చెప్పి.. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరాలని ఉద్బోధించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకురావాలని మార్గనిర్దేశం చేశారు. తాడే­పల్లి­లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సమా­వేశ­మయ్యారు. ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం ఏమన్నారంటే..

ప్రజలతో మమేకమవ్వండి 
► నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుండటానికి ప్రధాన కారణం.. ఒకటి కార్యకర్తలను కలుసుకోవడం, రెండు మరో 14–15 నెలల్లో జరగనున్న ఎన్నికలకు సమా­యత్తం చేయడం. సచివాలయాల వారీగా కన్వీనర్లు, అలాగే ప్రతి 50 – 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి నియమిస్తున్నాం. పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్దాం. గృహ సారథుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండాలి. 
► గడపగడపకూ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేక­మ­వ్వండి. మూడున్నరేళ్లుగా చేస్తున్న మంచిని అక్కాచె­ల్లె­మ్మ­లకు వివరించండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. ఏ ఒక్కరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా, అర్హత ఉండి మిస్‌ అయి­పోతే దా­న్ని పరిష్కరించి మంచి చేయాలి. అర్హులెవ్వరూ మిగి­లిపో­కూడదన్న ఉద్దేశంతో ఇంత ధ్యాస పెడుతున్నాం. గతంలో ఎవ్వరూ, ఎప్పుడూ ఇంత ధ్యాస పెట్టలేదు. ఏడా­దిలో రెండుసార్లు అలాంటి వారికి అన్నీ మంజూరు చేస్తున్నాం. 

ప్రస్ఫుటంగా రాజకీయ మార్పు 
► రాష్ట్రంలో 88% ఇళ్లకు మంచి చేశాం. ప్రతి అక్క, చెల్లె­మ్మ పేర్లతో సహా చేసిన మంచిని పారదర్శకంగా చెప్పగలం. అందుకనే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజ­కీయ మార్పు జరుగుతోంది. కుప్పంలాంటి చోట్ల మున్సి­పాల్టీ, ఎంపీపీ­లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్ని ఎ­న్నికల్లో 80%­కి పైగా క్లీన్‌ స్వీప్‌ చేయ­గలిగాం. విజయ­వాడ తూర్పు ని­యోజకవర్గంలో కూడా 21 డివిజన్లలో 14 చోట్ల గెలిచాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగాం. మార్పు అనేది కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు. 

టార్గెట్‌ 152 కాదు.. 175
► వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 175 కు 175 సీట్లు మనం గెలవాలి. అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఏ వార్డులోకి వెళ్లినా, గ్రామంలోకి వెళ్లినా.. ప్రతి ఇంట్లో కూడా సంతోషం కనిపిస్తోంది. 
► మన ప్రాంతంలో స్కూళ్లు మారుతున్నాయి.. చదువులు మారుతున్నాయి.. ఆస్పత్రులు మారుతున్నాయి. ఆర్బీకేల ద్వారా వ్యవసాయం మారుతోంది.  ఇంత మార్పు అన్నది ఎప్పుడూ జరగలేదు. వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పూర్తి స్థాయిలో వస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో మనం తీసుకొచ్చిన మార్పులన్నీ పూర్తి స్థాయిలో ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ ఎన్నికలకు మనం అంతా కలిసికట్టుగా పని చేయాలి. ఎలాంటి విభేదాలున్నా పక్కన పెట్టాలి. 
► వచ్చే ఎన్నికలను సీరియస్‌గా తీసుకుందాం. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించాం. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్‌ 152 కాదు.. 175 స్థానాల్లో గెలవడమే మన టార్గెట్‌. ఈసారి గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. 30 ఏళ్లపాటు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాం.
►  నాకు ఎన్ని కష్టాలు ఉన్నాసరే.. బటన్‌ నొక్కే కార్యక్రమాన్ని చేస్తున్నాను. మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. ఒక­రికొకరు కలిసి ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలి. ప్రతి ఇంటికీ వెళ్లి.. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. మనకు ఓటు వే­య­ని వారి ఇళ్లకు కూడా మనం వెళ్లాలి. చేసిన మంచిని వా­రి­కి వివరిస్తే.. కచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చే అ­వ­కాశం ఉంటుంది. మనం వెళ్లకపోతే తప్పు చేసినట్టు అ­వు­తుం­ది. అందుకనే ప్రతి ఇంటికీ వెళ్లాలి. అందరి ఆశీ­ర్వా­దా­లు కోరాలి. మంచితనంతో మన ప్రయత్నం మనం చేయాలి. 
► విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, పార్టీ ఎన్‌టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top