మూడు రోజులు వానలు!

Chance of moderate rain at many places - Sakshi

పలుచోట్ల మోస్తరుగా కురిసే అవకాశం

కొనసాగుతున్న ఈశాన్య, తూర్పు గాలులు

భారత వాతావరణ శాఖ వెల్లడి 

సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవ­­ర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ఈశాన్య రుతు­పవ­నా­లు ఒక మోస్తరు చురుకుదనాన్ని సంతరించుకున్నాయి.

వీటన్నింటి ప్రభా­వంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేకచోట్ల తేలిక­పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో అక్క­­­డక్కడ ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని పేర్కొంది. కాగా, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని పలుచోట్ల తేలిక­పా­టి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

నగరి (చిత్తూరు)లో 5.5 సెం.­మీ.లు, యలమంచిలి (అన­కాపల్లి) 5.2, సత్తెనపల్లి (పల్నాడు) 5.1, ముతు­కుల (ప్రకాశం) 4.3, బ్రాహ్మణ­పల్లి (ఎస్పీఎస్సార్‌ నెల్లూరు) 4.2, మొగు­లూ­రు (ఎన్టీఆర్‌) 4.1, వడమాలపేట (తిరుపతి) 3.4, చిన్నతిప్పసముద్రం (అన్నమయ్య), పెందుర్తి (విశాఖపట్నం)లో 3.2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top