
రాష్ట్ర ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లు పైబడి ఉన్న వివిధ ప్రధాన పథకాలకు మొత్తం రూ.38,014.57 కోట్లను గ్రాంటు రూపంలో ఇచ్చినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన తాజా నివేదికలో వెల్లడించింది.
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లు పైబడి ఉన్న వివిధ ప్రధాన పథకాలకు మొత్తం రూ.38,014.57 కోట్లను గ్రాంటు రూపంలో ఇచ్చినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంఘాలకు ఆర్థిక సహకారంగా రూ.9,155.81 కోట్లను గ్రాంటుగా ఇచ్చినట్లు ఆ నివేదికలో తెలిపింది. అలాగే, వైఎస్సార్ రైతుభరోసా కోసం రూ.3,615 కోట్లు ఇచ్చినట్లు కాగ్ పేర్కొంది.