Purandeswari: BJP Leader Welcomed Naming of New District as NTR, Tweet Viral - Sakshi
Sakshi News home page

NTR District: కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు.. స్పందించిన పురందేశ్వరి

Jan 27 2022 8:52 AM | Updated on Jan 27 2022 3:29 PM

BJP Leader Purandeswari Welcomed Naming of New District as NTR - Sakshi

Purandeswari welcomed the decision of YS Jagan: మహనీయుడు నందమూరి తారక రామారావు పుట్టిన జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లా అని పేరు పెట్టడాన్ని ఆయన బిడ్డగా తాను స్వాగతిస్తున్నట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి తెలిపారు. ప్రజాభీష్టం ఈ నాటికి నెరవేరిందని బుధవారం ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గెజిట్‌ కూడా విడుదలైంది. పాదయాత్ర సందర్భంగా నాడు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా నిలబెట్టుకున్నారంటూ కృష్ణా జిల్లా వాసులు, ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతగానో సంబరపడుతున్నారు. నిమ్మకూరులోని నందమూరి కుటుంబీకులూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. విలువలు, విశ్వసనీయతకు మారుపేరైన నాయకుడు జగనే అంటూ కొనియాడుతున్నారు.  


చదవండి: (కనుల ముందు కలల జిల్లాలు) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement