సాక్షి,శ్రీకాకుళం: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మానప్రసాద్ రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు శాస్త్రీయమైన గణన ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. బీసీలను చంద్రబాబు మోసం చేశారన్నారు. శ్రీకాకుళంలో ఈ రోజు శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
బీసీలకు సంబంధించిన సర్వేను ఏ ప్రాతిపాదికన చేశారని ప్రశ్నించారు.కూటమి నేతలు ఒకరోజు ఏకసభ్య కమిషన్ అంటూనే మరోసారి సమగ్ర కుటుంబ సర్వే అంటుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు కొట్టేస్తారని తెలిసే సుప్రీంకోర్టుకు వెళ్లారని చట్టానికి వ్యతిరేకంగా జీవోలు విడుదల చేశారన్నారు.


