కూన రవిపై ప్రివిలేజ్‌ కమిటీ ఆగ్రహం

AP Previlage Committe End: Further Meet On September 14th - Sakshi

ముగిసిన సమావేశం.. వచ్చేనెల 14న మరోసారి భేటీ

సాక్షి, అమరావతి: ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం ముగిసింది. తదుపరి సమావేశానికి వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అచ్చెన్నాయుడుకు అవకాశం ఇచ్చింది. అనంతరం కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేనని అచ్చెన్నాయుడు సమాచారం అందించారు. వచ్చే నెల 14వ తేదీన హాజరు కావాల్సిందిగా అచ్చెన్నాయుడుకు నోటీసులిస్తున్నట్లు చైర్మన్‌ కాకాని గోవర్దన్‌ రెడ్డి తెలిపారు. 

కూన రవిని వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణించింది. కూన రవిది ధిక్కారంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలను పాటించకుండా కూన రవి తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడ్డారని మండిపడింది. కూన రవిపై చర్యలు తీసుకునే అంశాన్ని ప్రివిలేజ్ కమిటీలో నిర్ణయం తీసుకోనాలని సభ ముందు ఉంచుతామని తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top