ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌: మంత్రి రోజా

AP Minister RK Roja Criticized Jana Sena Chief Pawan Kalyan - Sakshi

సాక్షి, గుంటూరు: లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి జగన్ అయితే లక్ష్యం లేకుండా పవన్‌ కల్యాణ్‌ దిగజారి పోతున్నాడని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చదువు ఒక్కటే ముఖ్యం కాదని.. క్రీడలు కూడా ముఖ్యమేనన్నారు మంత్రి రోజా. క్రిీడల వల్ల ఆరోగ్యం, ఆనందం  వస్తుందన్నారు. ఎన్ని కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు, ఎంత మంది నిందించినా విజయం ద్వారా సమాధానం చెప్పాలని సూచించారు. క్రీడల‍్లో పాల్గొనటం ద్వారా దేశం తరుపున ఆడే గొప్ప అవకాశం లభిస్తుందని, అందుకోసం కృష్టి చేయాలని చెప్పారు. 

‘నేను ఎన్నో అవమానాలు ఎదురైన వెనుదిరగకుండా ముందుకు వెళ్ళాను. ఆట ఏది అయిన మన లక్ష్యం సెక్సెస్‌పై మాత్రమే ఉండాలి. సీఎం వైఎస్‌ జగన్ చూసినన్ని అవమానాలు ఎవరు చూసి ఉండరు. కానీ 151 సీట్లల్లో  విజయంతో అందరికి సమాధానం చెప్పారు. లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి జగన్ అయితే లక్ష్యం లేకుండా దిగజారి పోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్‌. హ్యాండ్ బాల్ ఆడే 22 మంది మెరికలాంటి యువకులకు శాప్ తరుపున అన్నివిధాల శిక్షణ ఇస్తున్నాము. శాప్‌కి సపోర్ట్ చేస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతలు. ’ అని తెలిపారు మంత్రి రోజా. 

క్రీడల్లో కష్టపడుతున్న ఆటగాళ్లకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు మంత్రి రోజా. రాబోయే సీఎం వైఎస్‌ జగన్ పుట్టినరోజు సందర్భంగా ‘జగనన్న క్రీడా సంబరాలు’ పేరుతో రూ.50 లక్షల నగదు బహుమతితో క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర క్రీడాకారులు పట్టుదలతో నేషనల్ నుంచి ఒలింపిక్స్ వరకు వెళ్లాలని, క్రీడల్లో కష్టపడితే ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి తెలిపారు. 

ఇదీ చదవండి: నిపుణులు ఎంత చెప్పినా చంద్రబాబు వినలేదు: స్పీకర్‌ తమ్మినేని

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top