అల్లాహ్‌ దీవెనలతో మానవాళికి సకల శుభాలు కలగాలి | YS Jagan Mohan Reddy extended Eid Mubarak greetings | Sakshi
Sakshi News home page

అల్లాహ్‌ దీవెనలతో మానవాళికి సకల శుభాలు కలగాలి

Mar 21 2026 4:49 AM | Updated on Mar 21 2026 4:49 AM

YS Jagan Mohan Reddy extended Eid Mubarak greetings

ముస్లిం సోదరులకు వైఎస్‌ జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు 

సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా మాజీ ముఖ్య­మంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈద్‌ ముబారక్‌ (శుభాకాంక్షలు) తెలిపారు. ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ చేయడం వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్‌ స్మరణలో తరించే ఈ రంజాన్‌ పండుగ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. 

అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ పర్వదినం ఒక ముగింపు వేడుక అని ఆయన గుర్తుచేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని వైఎస్‌ జగన్‌ తన సందేశంలో తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement