ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. మార్చి19 వరకు సమావేశాలు | AP Assembly Budget Sessions On 24th Feb Live Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. మార్చి19 వరకు సమావేశాలు

Feb 24 2025 9:16 AM | Updated on Feb 24 2025 12:43 PM

AP Assembly Budget Sessions On 24th Feb Live Updates

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. Day-1 లైవ్‌ అప్‌డేట్స్‌

అసెంబ్లీ రేపటికి వాయిదా

  • గవర్నర్‌ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. 
  • కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. 
  • 15 రోజులు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీ నిర్ణయం
  • మార్చి 19 వరకు అసెంబ్లీ సమావేశాలు.

ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే: బొత్స

  • అసెంబ్లీలో మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యీ బొత్స సత్యనారాయణ కామెంట్స్‌..
  • ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం.
  • సభలో రెండే పక్షాలు.. ఒకటి ప్రతిపక్షం, రెండోది అధికారపక్షం.
  • రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.
  • ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే.
  • ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుంది. 
  • రైతుల బాధలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్య లేదు.
  • కేంద్రంతో మాట్లాడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చెబుతున్నారు.
  • మరి ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి.
  • కూటమి గ్యారెంటీ అంటేనే మోసం.
  • అందుకే ప్రజల కష్టాలు చెప్పేందుకే మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం.
  • రైతుల కష్టాలు, సమస్యలపై పోరాడితే మాపై కేసులు పెడుతున్నారు.
  • రైతుల బాధలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్య లేదు.
  • తొమ్మిది నెలలు గడిచినా సూపర్‌ సిక్స్‌ హామీలపై ఎలాంటి చర్యలు లేవు.
  • ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వ స్పందన చూశాకే మా తదుపరి చర్య ఉంటుంది.
  • ప్రజల సమస్యల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ప్రభుత్వ చొక్కా పట్టుకుంటాం.
  • మిర్చీకి వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. 
  • రైతుల సమస్యలకు ఎన్నికల కోడ్ అడ్డొస్తుంది
  • మ్యూజికల్ నైట్ లకు ఎన్నికల కోడ్ వర్తించదా?.

ప్రజస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్‌కు లేదా?: చంద్రశేఖర్‌

  • అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ కామెంట్స్‌..
  • కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.
  • ప్రతిపక్షం ఇవ్వకపోవడం అంటే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లే.
  • అధికార మదంతో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్న చేస్తున్నారు.
  • అధికార పక్షానికి సమాధానం చెప్పే సత్తా లేదా?.
  • మీరు చేసే దోపిడీని బయటపెడతామాని భయమా?.
  • మా 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేదా?.
  • ప్రజస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్‌కు లేదా?
  • దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మీడియాపై నిషేధం విధించారు.
  • 41 ఓటింగ్ ఇచ్చారు ప్రజలు.. అంటే ప్రతిపక్షం అంటే ఇదేగా..
  • 6 శాతం ఓట్లు వచ్చిన వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇచ్చి పక్కన పెట్టుకున్నారు..
  • ప్రజా పద్దుల కమిటీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అధికార పార్టీ వల్లే అనుమభవిస్తున్నారు..
  • కూటమి నిరంకుశత్వంగా వ్యహరిస్తోంది
  • ప్రధాన ఛానల్స్ పై ఆంక్షలు పెట్టడమేంటి
  • ప్రతిపక్ష గొంతు నొక్కడం కోసమే ఇలా చేస్తున్నారు
  • నోటీసులు కూడా ఇవ్వకుండా నాలుగు ఛానల్స్ బహిష్కరించిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా?.


ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్‌..

  • దేశ చరిత్రలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఉంటుందా?.
  • ఎందుకు ఏపీలోనే ప్రతిపక్షాన్ని గుర్తించడం లేదు.
  • కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తామనే కూటమికి భయం పట్టుకుంది.
  • ఆ భయంతో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.
  • ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా
  • ఏపీలో ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు
  • నిరుద్యోగులు...రైతులు.. మహిళలు.. చిన్నపిల్లలను అందరినీ మోసం చేశారు
  • 15 వేల కోట్లు విద్యుత్ ధరలు పెంచారు
  • నిత్యావసర ధరలు 60% పెంచారు
  • ప్రజల తరపున ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు
  • తొమ్మిది నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారు
  • చంద్రబాబుకి కూడా అప్పు రత్న అవార్డు ఇస్తావా పవన్ సమాధానం చెప్పాలి
  • పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు
  • వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే
  • హోదా ఇచ్చే వరకూ పోరాడుతాం

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి: పెద్దిరెడ్డి

  • వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.
  • అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.
  • కూటమి ప్రభుత్వానికి, తాలిబన్ల పాలనకు తేడా లేదు. 

 

 

ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌

  • ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యులు వాకౌట్‌ చేశారు. 

  • గవర్నర్‌ ప్రసంగాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు బహిష్కరించారు. 

  • ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్సార్‌సీపీ నేతల నిరసన

  • అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసిన నేతలు

👉ప్రారంభమైన గవర్నర్‌ ప్రసంగం

  • ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

  • ప్రసంగం చదువుతున్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: వైఎ‍స్సార్‌సీపీ సభ్యులు

  • అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన

  • అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి.

  • ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వా‍ల్సిందే.. 

  • ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నిరసన


👉 ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

👉 ఏపీ అసెంబ్లీకి చేరుకున్న వైఎస్‌ జగన్‌

  • కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

  • అసెంబ్లీకి చేరుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

  • ప్రధాన ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌ను గట్టిగా నిలదీయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయం

  • ప్రజా సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరనున్న జగన్‌

  • ఆ సమయాన్ని హక్కుగా ఇవ్వాలని డిమాండ్‌

👉కాసేపట్లో శాసనసభ బడ్జెట్‌ సమా­వేశాలు ప్రారంభం 

  • ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ 

  • అనంతరం సభ వాయిదా పడనుంది.

     


     

👉అసెంబ్లీకి చేరుకున్న అన్ని పార్టీల  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  

అసెంబ్లీని తాకిన రెడ్‌బుడ్‌ రాజ్యాంగం

  • దేశం ఎన్నడూ, ఎక్కడా, ఏ అసెంబ్లీలోనూ లేని విధంగా మీడియా కవరేజీపై ఆంక్షలు.
  • అసెంబ్లీ సమావేశాలకు నాలుగు టీవీ చానెల్స్‌పై ఆంక్షలు విధింపు.
  • సాక్షితో పాటుగా మరో మూడు టీవీ చానెళ్లకు అనుమతి నిరాకరించారు.
  • ఎలాంటి నోటీసులు లేకుండా టీవీ చానెళ్లపై ఆంక్షలు 

👉 ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు. ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

👉25వ తేదీన గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది.

👉ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు హాజరవుతారనే సమాచారంతో ఆంక్షలు పెంచారు. భద్రత పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవేశాలు, రాకపోకలకు సంబంధించి నిబంధనలను పెంచారు. అసెంబ్లీ, శాసన మండలికి వెళ్లేందుకు వేర్వేరు రంగులతో పాస్‌లు ఇచ్చారు. అధికారులు, మీడియా, విజిటర్లు, పోలీసులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి చెందిన పార్టీలకు ఎన్ని కావాలంటే అన్ని పాసులు జారీ చేసి వైఎస్సార్‌సీపీకి మాత్రం చాలా పరిమితంగా పాసులు ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement