తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత.. | Another Leopard Trapped In Cage At Tirumala, Making Arrangements To Move Leopard To The Zoo - Sakshi
Sakshi News home page

తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత..

Published Wed, Sep 20 2023 7:02 AM

Another Leopard Trapped In Cage At Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. శ్రీవారి ఆలయానికి వెళ్లే నడకదారిలో బుధవారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో పట్టుబడింది. కాగా, నడకదారిలో వారం రోజులుగా అటవీశాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు. 

వివరాల ప్రకారం.. తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. చిరుత సంచారాన్ని గుర్తించిన అధికారులు బోనులు ఏర్పాటు చేయడంతో తాజాగా చిరుత బోనులో చిక్కింది. అయితే, చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత చిక్కడం విశేషం. ఇక, చిరుతను జూపార్క్‌కు తరలించడానికి అటవీశాక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో ఇప్పటి వరకు ఆరు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. 

ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం!

Advertisement
 
Advertisement
 
Advertisement