మక్కీకి మక్కీ దిశ యాప్‌ను కాపీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం | Andhra Pradesh Coalition Government Copies Disha App And Replaces It With The Sakthi App | Sakshi
Sakshi News home page

మక్కీకి మక్కీ దిశ యాప్‌ను కాపీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం

Mar 11 2025 7:48 PM | Updated on Mar 11 2025 7:56 PM

Andhra Pradesh Coalition Government Copies Disha App And Replaces It With The Sakthi App

సాక్షి, విజయవాడ : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా తన హయాంలో దిశ యాప్‌కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్‌ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే  అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ యాప్‌ను నిర్విర్యం చేసింది.

 తాజాగా అదే యాప్‌ను కూటమి ప్రభుత్వం కాపీ కొట్టింది. మక్కీకి మక్కీ దిశ యాప్ ఫీచర్ల తోనే శక్తి యాప్  రూపొందించింది. ఆ యాప్‌ వివరాల్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటించారు.  గతంలో దిశ యాప్‌ని చంద్రబాబు, హోంమంత్రి అనిత ఎగతాళి చేశారు. అదే దిశ యాప్‌ని కాపీ కొట్టి నేడు అమలు చేయడం గమనార్హం
 

Advertisement
 
Advertisement
Advertisement