పిల్లలూ.. మనం జంతువులను పుస్తకాల్లోనే చూడాలేమో..!

Anakapalle District: Kottapalem Head Master Teaches With Tiger Face Mask - Sakshi

హెచ్‌ఎం: పిల్లలూ... మీరెప్పుడైనా పులిని చూశారా...  
విద్యార్థులు: ఊహు.. చూడలేదు సార్‌... 

హెచ్‌ఎం: పోనీ.. ఏనుగునీ.. 
విద్యార్థులు: (లేదన్నట్టుగా తెల్ల మొహం) 

హెచ్‌ఎం: భవిష్యత్తులో మీరు వీటిని జూలో, పుస్తకాల్లోనే చూడాల్సిన పరిస్థితి రావొచ్చేమో.. 
విద్యార్థులు: ఎందుకు సార్‌? 

హెచ్‌ఎం: ఎందుకంటే... అడవులు నశించిపోవడంతో జంతు సంపద కూడా అంతరించిపోతోంది.. అంటూ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొత్తపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోసూరు రాము బోధించారు. విద్యార్థులతో జంతు మాస్క్‌లు ధరింపజేసి, ఆయన కూడా మాస్క్‌ వేసుకొని బోధన చేశారు.

దేశంలో వేలల్లో ఉన్న జంతు సంపద వందల్లోకి చేరిందని.. ప్రస్తుత పరిస్థితులను విద్యార్థులకు వివరించారు. వినూత్న రీతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తిగా విషయాన్ని అర్థం చేసుకుంటారనే ఇలా చేశానని ఆయన చెప్పారు. (క్లిక్ చేయండి: కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!)

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top