
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో 549 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నాలుగు దశల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌ల సంఖ్య 2,192కు చేరింది. తుది దశ ఎన్నికల కోసం ఈనెల 10న నోటిఫికేషన్ జారీచేసి 12వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించారు.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 2,750 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఈ నెల 21న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తారు. వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించిన అనంతరం వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.