తలారి రంగయ్య హౌస్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తలారి రంగయ్య హౌస్‌ అరెస్ట్‌

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

న్యూస్‌రీల్‌

కళ్యాణదుర్గం: పంచాయతీ ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ తలారి రంగయ్యను పోలీసులు గురువారం హౌస్‌ అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే నెపంతో ముందస్తుగా కళ్యాణదుర్గంలోని పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్బంధించారు. నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయావకాశాలను జీర్ణించుకోలేక టీడీపీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్నారని రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేపు నవోదయ ప్రవేశ పరీక్ష

లేపాక్షి: జవహర్‌ నవోదయ విద్యాలయలో 6వ తరగతి ప్రవేశం కోసం శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణపై సిబ్బందికి గురువారం అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఆయూబ్‌ హుస్సేన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేష్‌ సమక్షంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 5,548 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 3,220 మంది బాలురు, 2,328 మంది మంది బాలికలు ఉన్నారని లేపాక్షి నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ నాగరాజు తెలిపారు. అడ్మిట్‌ కార్డు నవోదయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని, డౌన్‌లోడు చేసుకునే సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే నవోదయ పాఠశాలలోని హెల్త్‌సెంటర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement