రెచ్చిపోయిన గూండాలు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన గూండాలు

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

హనకనహాళ్‌లో టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు

రాయదుర్గం : కణేకల్లు మండలం హనకనహాళ్‌లో ‘పచ్చ’ గుండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్ధి బి.ఎర్రిస్వామి 400 పైగా ఓట్లతో విజయం సాధించాడు. టీడీపీ నేతల డిమాండ్‌ మేరకు రీకౌంటింగ్‌ చేసినా ఎర్రిస్వామికే మోజార్టీ వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు బ్యాలెట్‌ పేపర్లను చించేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తెగబడ్డారు. టీడీపీ నేతల దాడుల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బి.నాగార్జున, చాకలి హరి, గుండ్లపల్లి ఎర్రిస్వామి గాయపడ్డారు. రీ కౌంటింగ్‌కు డిమాండ్‌ చేయగా.. బ్యాలెట్‌ పేపర్లు చించేసినందున రీపోలింగ్‌ నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆనంద్‌ ప్రకటించారు.

● రాయదుర్గం మండలం బొందనకల్లులో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి బోయ గంగమ్మ 325 ఓట్ల మెజార్టీ సాధించారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు రీకౌంటింగ్‌ కోరారు. రీకౌంటింగ్‌లోనూ ముందంజలో ఉండడంతో ‘పచ్చ’ గూండాలు సహనం కోల్పోయి పోలింగ్‌ కేంద్రం తలుపులను పగులగొట్టారు. అభ్యర్థి గంగమ్మ కుమారుడు భోజరాజును గాయపరిచారు. చదం గొల్లలదొడ్డిలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. అయినా ఈ రెండు స్థానాల్లో రాత్రి అయినా ఎన్నికల అధికారులు ఫలితాలు ప్రకటించకుండా నాన్చుడు ధోరణి అవలంబించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement