అక్కమ్మ ఆలయ అర్చకుల ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

అక్కమ్మ ఆలయ అర్చకుల ఘర్షణ

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

కళ్యాణదుర్గం రూరల్‌: పట్టణ సమీపంలోని ప్రసిద్ధి చెందిన అక్కమ్మగార్ల ఆలయంలో అర్చకుల మధ్య ఘర్షణ జరిగింది. సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అదే సమయంలో అర్చకులు ఒకరిపై, ఒకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో మంగప్ప అనే అర్చకుడు ఆలయం ప్రధాన తలుపులకు తాళం వేయడంతో భక్తులు ఆందోళకు గురయ్యారు. కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన అక్కమ్మ ఆలయంలో అర్చకుల మధ్య నిత్యం వివాదాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టక రెండేళ్లు పూర్తయిన అయిన అధికారికంగా ఆలయ కమిటీ పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఆలయ కమిటీ ఎన్నికలో రాజకీయం చేయడం ద్వారా ఇప్పటి వరకు కమిటి ఎన్నిక జరగలేదని భక్తులు అంటున్నారు. ఆలయాల్లో సైతం టీడీపీ నేతలు రాజకీయం చేయడంతో టీడీపీ నేతల ప్రవర్తనపై భక్తులు చీదరించుకుంటున్నారు.

ఏడీఏపై సస్పెన్షన్‌ ఎత్తివేత

అనంతపురం అగ్రికల్చర్‌: అనంతపురం ఏడీఏ అల్తాఫ్‌ అలీఖాన్‌ సస్పె న్షన్‌ను ఎత్తివేసి, కర్నూలు జిల్లా ఏడీఏగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్‌ అఫీషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్ర టరీ రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఏడీఏ కార్యాలయాన్ని మా ర్పు చేయడం, వివాదాస్పద నిర్ణయాలపై ఫిర్యాదులొచ్చాయి. దీంతో ఆయనపై విచారణ చేసి, ఈ ఏడాది మార్చి 30న సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆయన న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో ఊరట లభించింది. దీంతో ఆయన్ను కర్నూలు జిల్లా కేంద్రంలో రెగ్యులర్‌ ఏడీఏగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement