వామ్మో.. చిరుత | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. చిరుత

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

●మహా వరుణ యాగం

పెద్దవడుగూరు : మండల పరిధిలోని అప్పేచర్ల – బందార్లపల్లి మధ్య పెద్ద కొండ వద్ద రెండు రోజులుగా చిరుత సంచరిస్తోంది. మంగళవారం సాయంత్రం అప్పేచర్ల రైతులు పొలం వద్దకు వెళ్లగా.. కొండపైనుంచి చిరుత గాండ్రించింది. రైతులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం గ్రామస్తులకు విషయం తెలియజేశారు. గ్రామస్తులందరూ కలిసి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోగా.. కొండపై నుంచి చిరుత వెళ్లిపోయింది. తమను చిరుతబారి నుంచి కాపాడాలని గ్రామస్తులు గుత్తి ఫారెస్ట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

పెన్నహోబిలంలో వరుణ జపం చేస్తున్న అర్చకులు, గవిమఠం ఆవరణలో వరుణయాగం హోమాల్లో పాల్గొన్న ఉత్తరాధికారి, సహాయ కమిషనర్‌

ఉరవకొండ/ ఉరవకొండ రూరల్‌: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి.. ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో మంగళవారం మహా వరుణ యాగం నిర్వహించారు. ఆలయ ఈఓ సాకే రమేష్‌బాబు, ధర్మకర్త మండలి చైర్మన్‌ రేగాటి నాగరాజు ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం అర్చకులు, వేదపండితులు పెన్నా నదీ తీరాన శాస్త్రోక్తంగా వరుణ యాగం, వరుణ జపం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, అర్చకులు బాలాజీస్వామి, గుండూరావు పాల్గొన్నారు.

గవిమఠంలోనూ..

ఉరవకొండ గవిమఠంలోనూ మంగళవారం లోక కల్యాణం కోసం విశేష పూజలు, హోమాలు చేశారు. గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్‌ కరిబసవరాజేంద్రస్వామి, మఠం సహాయ కమిషనర్‌ బోయపాటి సుధారాణి ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అర్చకులు అధ్వర్యంలో వరుణ జపం, యాగం, సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాణి, గవిమఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement