నార్పల : మండలంలోని బండ్లపల్లి గ్రామానికి చెందిన సాయి అనే రైతు పొలంలో కేబుల్ కట్ చేస్తుండగా ఓ దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన సాయి అనే రైతు పొలంలో మంగళవారం తెల్లవారుజామున నార్పలకు చెందిన జంగాల కృష్ణయ్య అలియాస్ గిడ్డయ్య కేబుల్ కట్ చేస్తుండగా.. రైతు గమనించాడు. అతన్ని పట్టుకొని నిర్భందించి పోలీసులకు సమాచారం అందించాడు. బండ్లపల్లి గ్రామంలో ఎనిమిది మంది రైతులకు చెందిన సుమరు 500 మీటర్ల కేబుల్ పోయినట్లు పోలీసులకు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దొంగ నుంచి సుమారుగా రెండు కేజీల కాఫర్ వైరును స్వాధీనం చేసుకున్నారు. గతంలోను ఇతనిపై పలు దొంగతనాల కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు.


