ప్రభుత్వాస్పత్రుల్లో నిలిచిన వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రుల్లో నిలిచిన వైద్య సేవలు

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

● నిరవధిక సమ్మెలోకి కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగులు

అనంతపురం సిటీ: ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్ట్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. గత కొన్ని నెలలుగా దశలవారీ ఉద్యమాలతో తమ సమస్యలనుప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో మంగళవారం పూర్తిస్థాయిలో విధులు బహిష్కరించారు. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ శరత్‌బాబు మాట్లాడుతూ చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ అమలుకు కోరిన గడువు మూడో తేదీతో ముగిసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిరవధిక సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 742 మంది కాంట్రాక్ట్‌ నర్సులు, పారామెడికల్‌, ఫార్మసీ, ల్యాబ్‌ అసిస్టెంట్లు, టెక్నీషియన్లు సమ్మెలోకి వెళ్లారన్నారు. కాంట్రాక్ట్‌ నర్సుల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, జేఏసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో కనీస వేతనాలతోన పనిచేస్తున్న తమ పట్ల ప్రభుత్వ పెద్దలు కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను తక్షణమే రెగ్యులర్‌ చేయాలని, అప్పటి వరకూ వంద శాతం గ్రాస్‌ శాలరీ అందజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసే వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పని చేస్తున్న నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని తక్షణమే రెగ్యులర్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం జీజీహెచ్‌లో కాంట్రాక్ట్‌ నర్సుల ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహారదీక్షలకు ఆయన మద్దతు పలికి, మాట్లాడారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ జి.వెంకటనారాయణ, కన్వీనర్‌ లావణ్య, పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement