సదరం.. చేతివాటం | - | Sakshi
Sakshi News home page

సదరం.. చేతివాటం

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

అనంతపురం సిటీ: జిల్లాలో సదరం సర్టిఫికెట్ల జారీలో ‘మాఫియా’ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దివ్యాంగుల బలహీనతను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం జీవన భృతి కింద ప్రతినెలా రూ.6వేల నుంచి రూ.15 వేలు (పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి) చొప్పున పింఛన్‌ రూపంలో అందజేస్తోంది. ఇందుకు సదరం సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఇదే అదనుగా కొందరు వైద్య సిబ్బంది– దళారులు మాఫియాగా ఏర్పడి దందాకు తెరలేపారు. స్లాట్‌ బుక్‌ చేసుకునేటప్పటి నుంచి సర్టిఫికెట్‌ చేతికి అందే వరకు అర్హులైన దివ్యాంగులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.

అవినీతికి అడ్డాగా సదరం కేంద్రం..

అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సదరం సర్టిఫికెట్ల జారీ కేంద్రం అవినీతికి అడ్డాగా మారింది. వైకల్య నిర్ధారణ పత్రాల కోసం వచ్చే నిరుపేద వికలాంగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది, దళారులు కుమ్మకై ్క దందాకు తెరలేపారు. దివ్యాంగుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి.

శాతం పెంచడానికి ‘ధర’ నిర్ణయం

సాధారణంగా 40 శాతానికి పైబడి వైకల్యం ఉంటేనే ప్రభుత్వం అందజేసే రూ.6వేల సామాజిక భద్రతా పింఛన్‌ అందుతుంది. అంతకంటే తక్కువ ఉంటే ఎలాంటి ఫలితమూ ఉండదు. ఈ నిబంధనే కొందరు వైద్యుల పాలిట వరంగా మారింది. దీంతో మొదటిసారి సదరం స్లాట్‌ బుక్‌ చేసుకుని క్యాంప్‌నకు హాజరైతే వైద్యులు కొర్రీలు వేస్తూ తిప్పుకోవడం మొదలు పెడతారు. వైకల్య శాతం తక్కువ వేసి సర్టిఫికెట్‌ జారీ చేసేస్తారు. దీంతో విసుగు చెందిన బాధితులు చివరకు సదరం క్యాంప్‌ వద్ద దళారీని ఆశ్రయించి రూ.20 వేల నుంచి రూ.70 వేల వరకూ చెల్లించుకుని తమకున్న వాస్తవ వైకల్యంపై సర్టిఫికెట్‌ పొందుతున్నారు.

వైకల్య ధ్రువీకరణ పత్రం జారీలో అక్రమాలు

కాసులిస్తే అనర్హులకూ సర్టిఫికెట్ల జారీ

వైకల్య శాతాన్ని బట్టి ధర నిర్ణయం

అక్రమాలపై దివ్యాంగుల ఆందోళన

రూ.70 వేలు అడిగారు

మా ప్రాంతానికి చెందిన ఓ మహిళ పూర్తిగా మంచానికే పరిమితమైంది. ఆమెకు సదరం సర్టిఫికెట్‌ అందితే ప్రభుత్వం నుంచి రూ.15 వేల పింఛన్‌ అందుతుంది. అయితే సదరం సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు రూ.70 వేలు అడుగుతున్నారు. నిరుపేద అయిన ఆమె అంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తీసుకువస్తుందో లంచం అడిగిన డాక్టర్లే చెప్పాలి. – రంగనాథ్‌, పాతకల్లూరు, గార్లదిన్నె మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement