రాప్తాడు రూరల్ : రాప్తాడు తహసీల్దారు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించలేదు. ముందస్తు సమాచారం లేకుండానే కార్యక్రమం రద్దు కావడంతో వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.
అనంతపురం అర్బన్‌లో ఇద్దరే..
అనంతపురం అర్బన్ తహసీల్దారు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు తహసీల్దారు దేవన్‌రాజా, హౌసింగ్ ఏఈ జమీల్ అహమ్మద్ మాత్రమే హాజరయ్యారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జ్యోతి పేరుతో హాజరు పట్టికలో సంతకం ఉన్నప్పటికీ.. ఆమె అక్కడ కనిపించలేదు.


