ఆత్మకూరు: తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరు కావడానికి ఎకై ్సజ్, పోలీస్, ఇరిగేషన్, రవాణా, వైద్యం, ఇలా చాలా శాఖల అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఏనాడూ సమయ పాలన పాటించిన పాపాన పోలేదు. అలా వచ్చి.. ఇలా వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది. ఒక వేళ అర్జీలు స్వీకరించినా పరిష్కారం లభించడం లేదు. దీంతో అధికారులపై నమ్మకం లేక ప్రజలు నేరుగా కలెక్టరేట్‌కు వెళ్తున్నారు. ఈ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు మూడు అర్జీలు మాత్రమే రావడం ఇందుకు నిదర్శనం.


