సీఎం సభ.. ప్రయాణికులకు సెగ | - | Sakshi
Sakshi News home page

సీఎం సభ.. ప్రయాణికులకు సెగ

Oct 6 2026 1:30 AM | Updated on Oct 6 2026 1:30 AM

అనంతపురం క్రైం: సీఎం సభలు ప్రయాణికులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. నెల్లూరు, మదనపల్లి తర్వాత ఇప్పుడు ప్రొద్దుటూరు.. ఎక్కడ సీఎం పర్యటన ఉన్నా జన సమీకరణ కోసం ఆర్టీసీ బస్సులను మళ్లించారు. సోమవారం ప్రొద్దుటూరు పర్యటన నిమిత్తం అనంతపురం, గుంతకల్లు, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ డిపోల నుంచి 150 బస్సులు కేటాయించారు. అయితే ముందస్తు సమాచారం తెలపకుండా బస్సులను మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బస్సులకోసం గంటల తరబడి ఎదురుచూసి.. ఇక రావని తెలుసుకున్నాక ఆటోలు, జీపులు తదితర ప్రైవేట్‌ వాహనాల ద్వారా గమ్యస్థానాలు చేరుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై ప్రజలు మండి పడుతున్నారు.

మళ్లింపు ఆపకుంటే బస్సులను అడ్డుకుంటాం

ముఖ్యమంత్రి పర్యటన పేరిట ఆర్టీసీ బస్సులను మళ్లిస్తే సాధారణ ప్రయాణికుల పరిస్థితి ఏమిటని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌.నాగేంద్రకుమార్‌ ప్రశ్నించారు. నెల్లూరు, మదనపల్లి తర్వాత ఇప్పుడు ప్రొద్దుటూరులో సీఎం సభ కోసం బస్సులను తరలించడం వల్ల ప్రజా రవాణా తీవ్రంగా దెబ్బతింటోందని విమర్శించారు. బస్సుల మళ్లింపు ఆపకపోతే సభలకు వెళ్లే వాహనాలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఆర్టీసీ బస్సుల మళ్లింపుతో రెట్టింపు కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement