గుత్తి రూరల్: తహసీల్దారు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు మధ్యాహ్నం 12.30 గంటలైనా ముఖ్య అధికారులు రాలేదు. కిందిస్థాయి అధికారులు ఆలస్యంగా వచ్చి సంతకాలు చేసి వెళ్లిపొయారు. ప్రతి వారమూ ఇదే పరిస్థితి.
ఖాళీ కుర్చీలే..
గుంతకల్లు రూరల్: గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సగం మంది అధికారులే హాజరయ్యారు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
వస్తారు....పోతారు
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో పీజీఆర్‌ఎస్‌కు 9 మంది అధికారులు హాజరైనట్లు సంతకాలు చేసినా.. ఆరుగురే కనిపించడం గమనార్హం.


