ప్రాణాలకు తెగించి ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు తెగించి ప్రయాణం

Oct 6 2026 1:30 AM | Updated on Oct 6 2026 1:30 AM

శెట్టూరు: మండల పరిధిలోని కనకూరు నుంచి కళ్యాణదుర్గం ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో కనకూరు, చౌళూరు, కరిడిపల్లి, చింతర్లపల్లి గ్రామంలో విద్యార్థులు ఎక్కారు. సాధారణ ప్రయాణికులు, విద్యార్థులతో బస్సు కిక్కిరిసిపోయింది. చాలామంది బస్సు టాప్‌పై కూర్చొని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. చింతర్లపల్లి దాటిన తర్వాత సరఫరా ఉన్న విద్యుత్‌ తీగలతో పెద్ద ప్రమాదమే తప్పింది. స్థానికులు వెంటనే గమనించి బస్సును ఆపి ముందుకు వెళ్తే విద్యుత్‌ తీగలు తగులుతాయని హెచ్చరించడంతో కొందరు విద్యార్థులు బస్సు దిగిపోయారు.

కళ్యాణదుర్గం: ఉచిత బస్సు ప్రయాణం (సీ్త్ర శక్తి ఉచిత బస్సు పథకం) విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సోమవారం కళ్యాణదుర్గం నుండి బోరంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు వెళ్లే విద్యార్థులు ప్రమాదకరంగా పుట్‌బోర్డుపై ప్రాణాలకు తెగించి ప్రయాణించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్టీసీ అధికారులు ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు కార్యక్రమానికి కళ్యాణదుర్గం డిపో నుండి సుమారు 30 బస్సులు పంపడంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement