మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

Oct 4 2026 9:43 AM | Updated on Oct 4 2026 9:43 AM

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో గుర్తించిన 50 ఓపెన్‌ కేటగిరీ, 3 గీత కార్మికులకు సంబంధించిన మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఏడో తేదీన దరఖాస్తుల పరిశీలన, 8న లాటరీ ద్వారా షాపులు కేటాయింపుదుంటుందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు స్థానిక ఎకై ్సజ్‌ పోలీసుస్టేషన్లలో సంప్రదించాలని సూచించారు.

వేతనాలకు మాత్రమే నిధులు ఖర్చు చేయాలి

అనంతపురం అర్బన్‌: శ్రీ సత్యసాయి వాటర్‌ సప్‌లై ప్రాజెక్టు బోర్డు నిధులను వేతనాలకు మాత్రమే ఖర్చు చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ప్రాజెక్టు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. గత ఏడాది అక్టోబరు నుంచి గత నెల 30 వరకు జరిగిన రూ.110 కోట్ల ఖర్చులకు సంబంధించి పరిపాలనా అనుమతులకు బోర్డు ఆమోదం తెలిపింది. కలెక్టర్‌ మాట్లాడుతూ నిధులను వేతనాల కోసం ఖర్చు చేయాలని, అలా కాకుండా ఇతర పనులకు ఖర్చు చేయాల్సి వస్తే పని ప్రారంభం కంటే ముందే అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ఆ జిల్లా కలెక్టర్‌, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈకి లేఖ రాయాలని సూచించారు. కల్లూరు– గార్లదిన్నె మధ్య ఉన్న స్కీమ్‌కు సంబంధించి పాత సర్వీస్‌ కనెక్షన్‌ను పునరుద్ధరించాలని చెప్పారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రీనివాసులు, డీఈఈ రామారావు, శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి రామేశ్వర్‌ పృష్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎస్‌ఓ లీమారోజ్‌, పీజీటీ లీలావతిపై సస్పెన్షన్‌ వేటు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఆత్మకూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్రస్థాయి అధికారులు కొరడా ఝుళిపించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని భవనం పైనుంచి దూకిన ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించిన వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. స్పెషల్‌ ఆఫీసర్‌ లీమారోజ్‌, ఘటన జరిగిన రోజు రాత్రి విధుల్లో ఉన్న పీజీటీ లీలావతిని సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నైట్‌వాచ్‌ ఉమెన్‌కు హెచ్చరిక జారీ చేశారు. తాత్కాలికంగా బెళుగుప్ప కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌కు ఆత్మకూరు కేజీబీవీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. విద్యార్థిని భవనం పైనుంచి దూకినంతటి తీవ్రమైన ఘటన చోటు చేసుకున్నప్పటికీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రిలో చికిత్స చేయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన కేజీబీవీలో ఇలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోవడంపై రాష్ట్ర అధికారులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వందే భారత్‌ శిబిరానికి నలుగురు వలంటీర్ల ఎంపిక

అనంతపురం ఎడ్యుకేషన్‌: నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగానికి చెందిన నలుగురు వలంటీర్లు వందే భారత్‌ శిబిరానికి ఎంపికయ్యారు. పుదుచ్చేరిలో ఈ నెల 6 నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్న శిబిరానికి కళాశాల తరఫున చందన, మహేశ్వరి, వికాస్‌, కల్యాణ్‌ ఎంపిక కావడం విశేషం. వికసిత భారత్‌ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడంతో పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణపై యువతకు తగిన శిక్షణ ఇవ్వడం శిబిరం ప్రధాన ఉద్దేశమని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మశ్రీ తెలిపారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీరాములు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారులు డాక్టర్‌ నాగభూషణ, డాక్టర్‌ బృంద, డాక్టర్‌ సుగప్ప, డాక్టర్‌ గోపాల్‌, శ్రీనివాసులు, డాక్టర్‌ చాముండేశ్వరి ఎంపికై న వలంటీర్లను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement