పెద్దపప్పూరును కరువు జాబితాలో చేర్చండి | - | Sakshi
Sakshi News home page

పెద్దపప్పూరును కరువు జాబితాలో చేర్చండి

Oct 4 2026 9:43 AM | Updated on Oct 4 2026 9:43 AM

● కలెక్టర్‌కు రైతుల వినతి

పెద్దపప్పూరు: తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్న పెద్దపప్పూరును కరువు మండలంగా ప్రకటించాలని రైతులు కోరారు. చాగల్లు ప్రాజెక్టు కట్టపై జరుగుతున్న కంపచెట్ల తొలగింపు పనులను శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రతి ఒక్కరికీ ‘ఉపాధి’ కల్పించాలి

బుక్కరాయసముద్రం: గ్రామీణ ప్రాంతాల్లో పని అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. శనివారం చెదుల్ల గ్రామంలో ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు.

శింగనమల: రైతులు పశువుల షెడ్లను నిర్మించుకుంటే ఆదాయంతో పాటు, పశువులకు రక్షణ ఉంటుందని కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. శనివారం సి.బండమీదపల్లిలో పశువుల షెడ్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రావణిశ్రీతో కలిసి ఆయన భూమి పూజ చేశారు.

అధికారులపై ఆగ్రహం

తాడిపత్రి రూరల్‌ : పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసిన అధికారులపై కలెక్టర్‌ ఆనంద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

అనంతపురం అర్బన్‌: ‘స్థానిక’ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్‌ శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ మునిసిపల్‌, జిల్లా పరిషత్‌, పంచాయతీ అధికారులతో సమీక్షించడంతో పాటు దిశా నిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement